iDreamPost

దేశంలో ఫస్ట్ టైమ్ రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా ట్రాన్స్‌జెండర్‌!

  • Published Feb 10, 2024 | 11:26 AMUpdated Feb 10, 2024 | 11:26 AM

ఈ మధ్య కాలంలో సొసైటీలో హిజ్రాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.. రాజకీయంగా, సామాజికంగా తమను తాము నిరూపించుకుంటున్నారు.. ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సొసైటీలో హిజ్రాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.. రాజకీయంగా, సామాజికంగా తమను తాము నిరూపించుకుంటున్నారు.. ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు.

  • Published Feb 10, 2024 | 11:26 AMUpdated Feb 10, 2024 | 11:26 AM
దేశంలో ఫస్ట్ టైమ్  రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా ట్రాన్స్‌జెండర్‌!

ఒకప్పుడు సమాజంలో ట్రాన్స్ జెండర్ అంటే చిన్నచూపు చూసేవారు.. చులకనగా భావించేవారు. వీళ్లు ఎక్కువగా రైళ్లలో, రోడ్లపై, షాపుల ముందు బిక్షాటన చేస్తుంటారు. వాళ్లను చూస్తే కొంతమంది జనాలు దూరంగా పారిపోతుంటారు. కొన్నిసార్లు హిజ్రాలపై దాడులు సైతం చేస్తుంటారు. తాము మనుషులమే అని.. సమాజాంలో స్త్రీ, పురుషులతో సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. హిజ్రాల పట్ల లింగ వివక్ష లేదని, సామర్థ్యం ఉంటే వాళ్లు ఎందులోనైనా విజయం సాధిస్తారని గతంలో కొంతమంది నిరూపించారు. ఆ కోవలోకి వస్తుంది.. తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఇప్పుడు ట్రాన్స్ జెండర్లను మనుషులుగా గుర్తిస్తున్నారు.. ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నియమించే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు ట్రాన్స్ జెండర్లకు కూడా కల్పిస్తుంది. తాజాగా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్ రైల్వే టికెట్ గా నిమితులయ్యారు. నాగర్ కోవిల్ కు చెందిన సింధు తమిళ సాహిత్యంలో బిఏ లిటరేచర్ చేసింది. కేరళా రాష్ట్రం ఎర్నా కులంలో 19 ఏళ్ల క్రితం రైల్వేలో చేరింది. తమిళనాడులోని దిండిగల్ కు బతిలపై వచ్చారు. అక్కడే గత 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు.

ఇటవల ప్రమాదంలో గాయపడ్డ సింధు ను రైల్వేలోని వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సింధు టికెట్ ఇన్స్ పెక్టర్ గా శిక్షణ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే దిండుక్కల్ రైల్వే డివిజన్ లో టికెట్ ఇన్స్ పెక్టర్ గా నియమితులయ్యారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘ నేటి సమాజంలో ట్రాన్స్ జండర్లకు గొప్ప స్థానంలో నిలబడే అవకాశాలు వస్తున్నాయి. తాము హిజ్రాలమని కృంగి పోకుండా, నిరాశ  చెందకుండా ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. నేను టికెట్ ఇన్‌స్పెక్టర్‌ని ఐనందుకు ఎంతగానో గర్వపడుతున్నా. ఈ స్థాయికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను’ అని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి