SNP
South Africa vs Nepal, T20 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో పసికూన టీమ్‌గా ఉన్న నేపాల్ జట్టు తాజాగా సౌతాఫ్రికాకు ముచ్చెమటలు పట్టించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
South Africa vs Nepal, T20 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో పసికూన టీమ్‌గా ఉన్న నేపాల్ జట్టు తాజాగా సౌతాఫ్రికాకు ముచ్చెమటలు పట్టించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చిన్న చిన్న టీమ్స్ పెద్ద పులుల్లా ఆడుతున్నాయి. ఛాంపియన్ టీమ్స్‌ను వణికిస్తున్నాయి. చిన్న జట్ల దెబ్బకి ఇప్పటికే హేమాహేమీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. తాజాగా సౌతాఫ్రికా, నేపాల్ మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు వణికించిన నేపాల్.. ఆల్‌మోస్ట్ ఓడించేసిందనే చెప్పాలి. ఒత్తిడి సమయంలో చేతులెత్తేసే సౌతాఫ్రికా.. నేపాల్‌పై మాత్రం తమ తలరాతను మార్చుకుంది. 3 బంతుల్లో 4 పరుగులు, 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో ప్రత్యర్థి నేపాల్ కాకుండా వేరే ఏ జట్టు ఉన్నా.. సౌతాఫ్రికా ఓడిపోయేది. ఎందుకంటే వాళ్లు ఒత్తిడి తట్టుకోలేరు. కానీ, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కంటే నేపాల్ ఎక్కువ ప్రెజర్‌కు గురైంది.
చివరి ఒక్క రన్ తేడాతో సౌతాఫ్రికా మ్యాచ్ గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినా.. నేపాల్‌పైనే ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్ 8కు క్వాలిఫై అయిపోవడంతో బతికి పోయింది కానీ, లేదంటే ఆ జట్టుపై మరింత ఒత్తిడి ఉండేది. కేవలం 116 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తూ.. ఒకానొక దశలో 85 పరుగులకు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి నేపాల్ చాలా పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు కాస్త పుంజుకొని కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. చరిత్ర సృష్టించాలనుకున్న నేపాల్.. ఒక్క పరుగులు దూరంలో ఆగిపోయింది. మ్యాచ్ ఓడిపోయినా.. నేపాల్ పోరాటంతో సౌతాఫ్రికా వణికిపోయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ హెన్‌డ్రిక్స్ 43, ట్రిస్టన్ స్టబ్స్ 27 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు డికాక్, మార్కరమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ విఫలం అయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 3, కుషాల్ 4 వికెట్లతో సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. ఇక 116 పరుగులు స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన నేపాల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 85 పరుగులు చేసి.. దాదాపు విజయం ఖాయం చేసుకుంది. ఇక్కడే సౌతాఫ్రికా సీనియర్ బౌలర్లు తమ అనుభవం ఉపయోగించి.. నేపాల్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి 4 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన సమయంలో నేపాల్ బ్యాటర్ గుల్సన్ ఫోర్ కొట్టాడు. దాంతో 3 బంతుల్లో 4 పరుగులు అవసరం అయ్యాయి. తర్వాతి బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇక 2 బంతుల్లో 2 పరుగులు. టీ20 వరల్డ్ కప్ 2024లో అతి పెద్ద సంచలనానికి రంగం సిద్ధమైంది. కానీ, బార్ట్‌మాన్ తెలివిగా చివరి రెండు బంతులు బౌన్సర్లు వేసి నేపాల్‌ను బోల్తా కొట్టించాడు. చివరి బాల్‌కు బ్యాటర్ రన్ అవుట్ కావడంతో సౌతాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో నేపాల్ పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RhinoFans We fall short of 1 run in the thriller at the world stage 🎯
📺 Watch Live: https://t.co/mYDZYaDLNa#OneBallBattles | #NepalCricket | #T20WorldCup | #OutOfThisWorld pic.twitter.com/wtUqqtMIX3
— CAN (@CricketNep) June 15, 2024
What a poor game awareness to lose this game by Nepal – a massive choke did by them#SAvNEP #PakistanCricket #NepalCricket pic.twitter.com/iBT4Eu7ZFP
— TCTV Cricket (@tctv1offl) June 15, 2024