iDreamPost

Ghost : ఘోస్ట్ కోసం లెజెండ్ భామ

Ghost : ఘోస్ట్ కోసం లెజెండ్ భామ

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్ సినిమా నిర్మాణం బంగార్రాజు కోసం తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మెయిన్ హీరోయిన్ గా గతంలో తీసుకున్న కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ప్రత్యాన్మాయం కోసం జరిపిన వేట కూడా ఆలస్యమయ్యింది. ఫైనల్ గా సోనాలి చౌహన్ ని లాక్ చేసినట్టు ఫ్రెష్ అప్ డేట్. గతంలో బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్ లో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటకి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. బాలయ్యే మళ్ళీ రూలర్ లో ఛాన్స్ ఇచ్చారు కానీ అది డిజాస్టర్ కావడంతో ఆఫర్లు ఆగిపోయాయి. లక్కీగా ఎఫ్3లో ఛాన్స్ వచ్చింది కానీ తమన్నా, మెహ్రీన్ అంత ప్రాముఖ్యత ఉండదు.

సో ఇప్పుడు ఘోస్ట్ లో చేయడం ఏదో రకంగా ప్లస్ అయ్యేదే. గతంలో అమలా పాల్ ని ట్రై చేశారు. కొంత షూట్ కూడా జరిగిందట. కానీ ఎందుకో మరి ఆమె కూడా వెళ్లిపోయింది. మెహ్రీన్ ని ప్రయత్నించారు కానీ రెమ్యునరేషన్ చిక్కులేవో వచ్చాయట. ఇంకో రెండు మూడు ఆప్షన్లు ట్రై చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా సోనాలి దగ్గర బంతి ఆగిందన్న మాట. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని అంటున్నారు. ఇప్పటికైతే ఖరారుగా చెప్పలేం . స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఘోస్ట్ లో నాగార్జున ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. కాకపోతే రెగ్యులర్ ఫార్మట్ లో ఉండదట.

దీని సంగతలా ఉంచితే నాగార్జున బంగార్రాజు జనవరిలో విడుదలయ్యాక వేసవిలో ఘోస్ట్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నాగ్ ని బ్లాక్ బస్టర్ పలకరించి చాలా కాలం అయ్యింది. బిగ్ బాస్ షోలు ఎన్ని చేసినా బాక్సాఫీస్ సక్సెస్ ఇచ్చే కిక్ ముందు అవన్నీ దిగదుడుపే. అందులోనూ ఇటీవలి కాలంలో అక్కినేని హీరోలకు ఓపెనింగ్స్ తగ్గాయి. ఉన్నంతలో నాగ చైతన్య స్టడీగా వెళ్తున్నాడు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు ముందు అఖిల్, నిన్న ఆఫీసర్ దాకా నాగ్ అందరిదీ ఒకే పరిస్థితి. నలుగురు సీనియర్ అగ్ర హీరోల్లో ఈ విషయంలో వెనుకబడింది నాగార్జుననే. మరి బంగార్రాజు, ఘోస్ట్ లు మార్కెట్ కి తిరిగి బూస్ట్ ఇస్తారేమో చూడాలి

Also Read : Pushpa : బయట మార్కెట్లకు నమ్మకం వచ్చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి