iDreamPost

ఆ హీరోయిన్ కోసం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న అభిమాని.. నటి అసహనం!

వెర్రి వెయ్యి విధాలు అంటుంటారు పెద్దలు. ఇక సినిమాల విషయంలో అది మరింత రెట్టింపు. తెరపై చూసిన సినీ సెలబ్రిటీలను.. తెర బయట కనిపిస్తే తట్టుకోగలరా.. ? వెంటనే కలవాలి అనుకుంటారు.. ఇదే ఓ నటీమణికి చేదు మొమరీగా మిగిలిపోయింది.

వెర్రి వెయ్యి విధాలు అంటుంటారు పెద్దలు. ఇక సినిమాల విషయంలో అది మరింత రెట్టింపు. తెరపై చూసిన సినీ సెలబ్రిటీలను.. తెర బయట కనిపిస్తే తట్టుకోగలరా.. ? వెంటనే కలవాలి అనుకుంటారు.. ఇదే ఓ నటీమణికి చేదు మొమరీగా మిగిలిపోయింది.

ఆ హీరోయిన్ కోసం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న అభిమాని.. నటి అసహనం!

‘బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో..కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో’ఈ పాట లిరిక్స్ వినగానే గుర్తుకు వచ్చే హీరోయిన్.. అందాల బొమ్మ సోనాలి బింద్రే. ఈ బాలీవుడ్ సోయగం.. టాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. నువ్వు నువ్వు అంటూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కట్టిపడేసిన ఈ భామ..చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగు ఇండస్ట్రీకి ఆమె దూరమై 20 ఏళ్లు అవుతుంది. అయినా ఆమెను మర్చిపోలేదు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఇక్కడే ఇలా ఉంటే.. బాలీవుడ్ చిత్రాలతో అశేషమైన ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ అభిమానం ఒక్కొక్కసారి హద్దులు దాటేస్తుంది. చివరకు ప్రాణాలు పోయేంత వరకు వెళుతుంది.

1994-2003 వరకు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీని చుట్టేసింది ఈ బ్యూటీ. ఆ రోజుల్లో సోనాలి బింద్రే కోసం ఓ అభిమాని ఏకంగా చెరువులో దూకి చనిపోయాడట.. ఈ విషయాన్ని తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని చెప్పింది సోనాలి. అప్పట్లో షూటింగ్ కోసమని భోపాల్ వెళ్లిందట ఈ స్టార్ హీరోయిన్. ఆమెను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. అయితే వారిలో ఓ అభిమాని చెరువులో పడి మృత్యువాత పడ్డాడట. ఇదే విషయాన్ని యాంకర్ అడగ్గా.. అయితే ఈ సంఘటన జరిగిందో లేదో తెలియదు కాదు అప్పట్లో ఈ న్యూస్ వచ్చిందని తెలిపింది. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ నాకు అస్సలు అర్థం కాదని, ఆ సంఘటనను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని విచారం వ్యక్తం చేసింది.

‘అప్పట్లో ఉత్తరాలు, మెయిల్స్ నాకు వచ్చేవి. కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారు. అది నిజంగా వాళ్ల రక్తమేనా? అనే సందేహం వచ్చింది. ఎందుకు అభిమానులు.. తమలాంటి మరో వ్యక్తుల కోసం తాపత్రయ పడతారో అర్థం కావడం లేదు. బాలీవుడ్ లోని ఫ్యాన్ కల్చర్, హీరో హీరోయిన్ పట్ల అతి ప్రేమ ఉండటం నాకు అస్సలు ఇష్టముండదు’ అని చెప్పుకొచ్చింది సోనాలి. తెలుగులో మురారితో కెరీర్ స్టార్ చేసిన సోనాలి.. ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో చేసింది.అటు బాలీవుడ్ స్టార్ నటీమణిగా ఎదిగింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే..గోల్డీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలాగే అడపా దడపా సినిమాలు చేసింది. ఇటీవల మహమ్మారి క్యాన్సర్ బారిన పడి.. బయటపడిన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి