iDreamPost
android-app
ios-app

దీప్తి కేసులో ట్విస్ట్.. అక్కను చంపింది నేనే : చందన!

దీప్తి కేసులో ట్విస్ట్.. అక్కను చంపింది నేనే : చందన!

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టెక్కీ దీప్తి మృతి కేసులో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దీప్తి అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో పాటు చెల్లెలు చందన కనిపించకుండా పోవడం.. ఆ తర్వాత ఓ బస్టాండులో సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రియుడితో ఉన్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు పెను సంచలనమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీప్తి శరీరంపై గాయాలతో పాటు ఆమె ఎడమ చేయి విరిగడంతో హత్య కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తొలి నుండి చెల్లెలు చందనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సోదరుడికి పంపినా వాయిస్ మేసేజ్ లో తాను అక్కను చంపలేదని, మూడు రోజుల క్రింత వారిద్దరి కలిసి చేసుకున్న మద్యం పార్టీ గురించి చెప్పింది. అక్క మద్యం తాగి పడిపోతే.. ఇదే అదును అని భావించి తాను డబ్బులు, నగదు తీసుకుని తన ప్రియుడితో కలిసి పరారైనట్లు చెప్పింది.

అయితే పోలీసులు బృందాలుగా ఏర్పడి.. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చందన ఇంటి నుండి వెళ్లిపోయేటప్పుడు.. పాస్ పోర్టు కూడా తీసుకెళ్లడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది ఈ ప్రేమ జంట. అయితే తొలుత తన అక్క దీప్తిని చంపలేదని బుకాయించిన చందన.. తమదైన స్టైల్లో పోలీసులు విచారిస్తే.. అసలు విషయం కక్కింది. పోలీసులకు పెద్ద ట్విస్టు ఇచ్చింది. తన అక్కను తానే చంపినట్లు అంగీకరించింది. తాను ప్రేమించిన వ్యక్తి.. మరో మతానికి చెందిన వాడని, తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని, తన ప్రేమను దీప్తి అక్క కూడా అర్థం చేసుకోలేదన్న.. అక్కసుతో తనను హత్య చేసినట్లు తెలిపింది. హత్యకు తన ప్రియుడితో పాటు అతడి తల్లి పాత్ర కూడా ఉన్నట్లు వాంగూల్మంలో చెప్పినట్లు తెలుస్తోంది. అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసినట్లు చందన తెలిపింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet GirişGrandpashabet Giriş