iDreamPost

మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి రచ్చ! ఇలా తెగించేశారు ఏంటి?

  • Published Apr 03, 2024 | 1:42 PMUpdated Apr 03, 2024 | 1:42 PM

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుందన్న మాట నిజమే. కానీ ఈ మధ్య వచ్చే వార్తలు మాత్రం నెటిజన్లకు అసహ్యం కలిగేలా ఉంటున్నాయి. తాజాగా మద్యం మత్తులో ఒక యువత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేసిందో తెలుసా..

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుందన్న మాట నిజమే. కానీ ఈ మధ్య వచ్చే వార్తలు మాత్రం నెటిజన్లకు అసహ్యం కలిగేలా ఉంటున్నాయి. తాజాగా మద్యం మత్తులో ఒక యువత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేసిందో తెలుసా..

  • Published Apr 03, 2024 | 1:42 PMUpdated Apr 03, 2024 | 1:42 PM
మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి రచ్చ! ఇలా తెగించేశారు ఏంటి?

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత అంతా .. సమయం , సందర్భం, చుట్టు ప్రక్కల పరిసరాలు ఇవేమి పట్టించుకోకుండా ఏవి పడితే అవి చేసేస్తున్నారు. దీని గురించి అధికారులు హెచ్చిరించినా .. తల్లిదండ్రులు బుద్ధి చెప్పినా కూడా పెడచెవిన పెడుతూ.. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ ఏవో ఒక వీడియోస్ చూస్తూనే ఉంటున్నాం. మొన్నటికి మొన్న మెట్రోలో హోలీ సందర్బంగా ఇద్దరు యువతులు చేసిన రొమాన్స్ వీడియో ఎంత వైరల్ అయిందో.. అది ట్రెండింగ్ లో ఉండగానే.. ఎయిర్పోర్ట్ లో లగేజ్ బ్యారియర్ మీద మరొక యువతి చేసిన విన్యాసాలు వైరల్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరికి పోటీగా.. మరొక యువతి రోడ్డు పైన తప్ప తాగి చిందులేస్తూ ఏం చేసిందో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.

ఉత్తప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన యువతి రుచి సింగ్ అనే యువతి.. మొదట యూట్యూబర్ గా వీడియోస్ చేస్తూ ఉండేది ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆమె వీడియోస్ వైరల్ అవుతూ ఉండడంతో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీనితో ఇంస్టాగ్రామ్ లో కూడా సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉండేది. ఆమె వీడియోస్ కు లైక్స్, కామెంట్స్ బాగా పెరిగిపోవడంతో ఈ యువతి రెచ్చిపోయి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ మధ్యన బైక్ పై వెనుకకు తిరిగి కూర్చుని అందరికి ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చిన యువతి కూడా ఈమె. ఇక ఇప్పుడు నడి రోడ్డు పైన తప్ప తాగి చిందులేస్తుంది. అటు వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ యువతి రెచ్చిపోవడంతో.. అది కాస్త పోలీసుల వరకు చేరింది. ప్రస్తుతం పోలీసులు ఆమె పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది.

ఇదివరకే ఎంతో మంది ఇలాంటి అడ్డు అదుపు లేని చేష్టలు చేసినపుడు.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మందలించిన దాఖలాలు ఉన్నాయి. అయినా సరే ఎవరు కూడా వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. రీల్స్ చేయడం .. డాన్స్ లు వేయడం అనేది వారి వారి వ్యక్తిగత విషయం . కానీ, ఆర్టీసీ బస్సులపైన, నడి రోడ్డుపైన, ట్రాఫిక్ మధ్యలోను, మెట్రో స్టేషన్స్ లోను, ఆఖరికి వారి పిచ్చి ఎయిర్పోర్ట్ వరకు కూడా చేరడంతో.. ఎంతో మంది పబ్లిక్ వీరి కారణంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి వీడియోస్ చేస్తూ.. చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారు. వీరిపై యాక్షన్ తీసుకున్నా సరే.. ప్రయోజనం ఉంటుందన్న గ్యారంటీ అయితే లేదని.. కొంతమంది భావిస్తున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి