iDreamPost

2022 వరకు సామాజిక దూరం తప్పదు

2022 వరకు సామాజిక దూరం తప్పదు

కరోనా వైరస్ కు ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేనందున ఆ వ్యాక్సిన్ కనుగొనేంతవరకు సామాజిక దూరం పాటించడం మరికొన్నేళ్ళు తప్పకపోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ప్రజలు గుంపులుగా ప్రజాబాహుల్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం లాంటివి నిషేదించక తప్పదంటున్నారు . రాబోయే చలికాలంలో సార్ వైరస్ మళ్ళీ సోకే ప్రమాధం ఉందని కరోనా వైరస్ కారణమైన సార్స్ మల్లీ తలెత్తే ఆ ప్రమాధం అంచనా ఉహాకు కూడా అందనంత భారీగా ఉంటుదని ఈ లోగా వ్యాకిన్ కనుగొనడం అసాద్యం కాబట్టి అందాకా సామాజిక దూరం నిబందనలు పాటించక తప్పదని హార్వర్డ్ సైంటిస్టులు తమ నివేదికలో వెళ్ళడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా మహమ్మారితో పలుదేశాలు అల్లాడుతున్నాయి . అమెరికాలాంటి అగ్రరాజయమే శవాలదిబ్బగా మారిపోయిన ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అమెరికాలో మరిన్ని రాష్ట్రాలు ఈ నెలలో కరోనా బారిన పడవచ్చు అని ప్రకటించిన నేపద్యంలో శాస్త్రవేత్తలు ఈ అధ్యాయన నివేదికను వెళ్ళడించారు. 2024 వరకు వైరస్ ఏదో ఒక రూపంలో తిరిగి ప్రబలే అవకాశం ఉన్నందున ఈ మహమ్మారిని అదుపు చేయడానికి ఒక సారి లాక్ డౌన్ సరిపోదని కనీసం 2022 వరకు బౌతిక దూరం నిబందనను ప్రజలందరు పాటించేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి