iDreamPost

KGF Chapter 2 : రాఖీ భాయ్ సినిమాకు ఎన్ని చిక్కులో

KGF Chapter 2 : రాఖీ భాయ్ సినిమాకు ఎన్ని చిక్కులో

ఒమిక్రాన్ పుణ్యమాని పాన్ ఇండియా సినిమాలకు గట్టి చిక్కులే వచ్చి పడుతున్నాయి. సోలో రిలీజ్ ఉంటే తప్ప వందల కోట్ల పెట్టుబడులు సేఫ్ కాలేని పరిస్థితుల్లో తీవ్రమైన పోటీని ఎదురుకోవాల్సి వస్తోంది. ఇది ఎవరూ కావాలని చెయకపోయినా దీని వల్ల వసూళ్ల మీద గట్టి దెబ్బ పడుతుందనే ఆందోళన డిస్ట్రిబ్యూటర్లలో వ్యక్తమవుతోంది. కెజిఎఫ్ 2 మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంపిటీషన్ ఉండకూడదనే ఉద్దేశంతో నెలల క్రితమే ఏప్రిల్ 14 విడుదల తేదీని ప్రకటించిన కెజిఎఫ్ 2కి ఇప్పుడు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. డేట్ మార్చుకుంటేనే బెటరేమో అనేలా పరిణామాలు విపరీతంగా మారిపోతున్నాయి.

ఇప్పుడు కెజిఎఫ్ 2 వస్తున్న రోజే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని పుకార్లు వస్తున్న నేపథ్యంలో తాము తగ్గేదేలే అంటూ నిర్మాణ సంస్థ ఇటీవలే క్లారిటీ కూడా ఇచ్చేసింది. విజయ్ బీస్ట్ కూడా అదే రోజు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి . అదే జరిగితే కెజిఎఫ్ 2కి తమిళనాడు, కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా థియేటర్ల పంపకాలకు సంబంధించి చాలా ఇష్యూస్ వస్తాయి. ఇది చాలదన్నట్టు ఆర్ఆర్ఆర్ కనక మార్చిలో కాకుండా ఏప్రిల్ 28న వస్తే కెజిఎఫ్ 2 కు కేవలం రెండు వారాల డ్రీమ్ రన్ మాత్రమే దక్కుతుంది. ఇది కలెక్షన్లని దెబ్బ తీసే వ్యవహారమే.

ఇప్పుడు కెజిఎఫ్ 2 వెనక్కు తగ్గకపోవచ్చు కానీ రెండు వందల కోట్లకు పైగా పెట్టుకున్న థియేట్రికల్ టార్గెట్ ని చేరుకోవడం మాత్రం అంత ఈజీగా ఉండదు. దీని ఫలితం చూశాకే కొత్త సినిమా ఎవరితో చేయాలనే నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్న యష్ కు ఈలోగా చాలా సమయం వృధా అయిపోతోంది. ఆ మధ్య పూరి జగన్నాధ్ తో ఓ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు కానీ అదీ అనుమానమే. మరోవైపు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ హ్యాపీగా ప్రభాస్ తో చేస్తున్న సలార్ ని చివరి దశకు తీసుకొచ్చేశారు. ఇంకొద్దిరోజుల్లో అదీ పూర్తవుతుంది. ఆ తర్వాత తారక్ లేదా చరణ్ స్క్రిప్ట్ మీద పని చేస్తారు. కానీ కెజిఎఫ్ 2 మాత్రం ఇలా లేట్ అవుతూనే ఉంది

Also Read : Loser Report : లూసర్ 2 రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి