iDreamPost

స్నేహ, మెట్టెల సవ్వడి సీరియల్ నటి కావేరి ఇలా అయిపోయిందేంటీ..?

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చినా.. కొన్ని పాటలు, కథలను బట్టి చాాలా కాలం పాటు గుర్తిండిపోతాయి. అటువంటి సీరియల్స్ లో మెట్టెల సవ్వడి ఒకటి. 2000 దశకంలో పిల్లల్ని, పెద్దల్ని అలరించింది ఈ ధారావాహిక. ఈ సీరియల్లో నటించిన కావేరి.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే...

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చినా.. కొన్ని పాటలు, కథలను బట్టి చాాలా కాలం పాటు గుర్తిండిపోతాయి. అటువంటి సీరియల్స్ లో మెట్టెల సవ్వడి ఒకటి. 2000 దశకంలో పిల్లల్ని, పెద్దల్ని అలరించింది ఈ ధారావాహిక. ఈ సీరియల్లో నటించిన కావేరి.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే...

స్నేహ, మెట్టెల సవ్వడి సీరియల్ నటి కావేరి ఇలా అయిపోయిందేంటీ..?

బుల్లితెరపై మహిళలను ఎంటర్ టైన్ చేస్తున్నాయి సీరియల్స్. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పలు ఛానల్స్‌లో సీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉంటే భార్యలు, అమ్మలు వీటిని చూస్తూనే పనులు చక్కదిద్దుతూ ఉంటారు. వీటికి బాగా కనెక్ట్ అయిపోతుంటారు. ఆ సీరియల్ బాధలను తమ బాధలుగా భావిస్తుంటారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుండంటే.. వీరి కడుపులు రగిలిపోతుంటాయి. ఇంట్రస్టింగ్‌గా సీరియల్ చూసినప్పుడు భర్త, పిల్లలు కదిపితే..పులై పోతుంటారు మహిళలు. అంతలా వారిపై ప్రభావం చూపుతున్నాయి ఈ ధారావాహికలు. ఎపిసోడ్లకు ఎపిసోడ్లు సాగిపోతూనే ఉంటాయి. సంవత్సరాల పాటు టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలా చాన్నాళ్ల పాటు అలరించిన సీరియల్స్‌లో ఒకటి మెట్టెల సవ్వడి.

మెట్టెల సవ్వడి ఓ.. ఓ మెట్టెల సవ్వడి అంటూ సాగే పాట ఎంత గుర్తింపు తెచ్చుకుందో.. ఆ సీరియల్ కూడా బాగా హిట్ అయ్యింది. ఇది ఒరిజినల్ తమిళ్ అయినప్పటికీ.. ఇక్కడ డబ్బింగ్ అయ్యి అలరించింది. జెమినీ టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమౌన ఈ ధారావాహిక పిల్లల నుండి పెద్దల వరకు చూసేవారు. ఒక తండ్రి, ఆయన ఐదుగురు కుమార్తెల కథే ఈ మెట్టెల సవ్వడి. ఈ సీరియల్లో కీ పాత్ర పోషించారు ఢిల్లీ కుమార్, కావేరి, గాయత్రి, వనజ, ఉమ, రేఖ, చేతన్, నీలిమా రాణి, బోస్ వెంకట్. ఈ సీరియల్ నటులంతా చాలా ఫేమస్. ఇందులో పెద్ద కుమార్తె కావేరి గుర్తుందా.. ఆమె తమిళ సీరియల్స్ చేయక ముందే తెలుగు వారికి సుపరిచితం. ప్రముఖ టీవీ చానల్ ఈనాడు ఏర్పడిన కొత్తలో ఆమె స్నేహ అనే సీరియల్ చేసింది.

‘స్నేహ.. స్నేహ.. స్నేహ.. చిక్కు ముడుల్లోన్నో చక్కగా విప్పే ఒకే ఒక వనిత’ అంటూ సాగిపోయే పాట ఇప్పటికి  చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది.  ఈ ధారావాహిక బాగా ఆకట్టుకుంది.. అందులో ఆమె నటనకు మంచి అప్లాజ్ వచ్చాయి. తెలుగు వాళ్లకు అదొక చిన్నపాటి సీఐడి, డిటెక్టివ్ సీరియల్ లాంటిదే.  ఆ తర్వాత ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తిండిపోయే అంతరంగాలు ధారావాహికలో కనిపించింది. ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోయింది. చాలా వరకు తమిళ సీరియల్స్‌లో నే స్థిరపడిపోయింది. ఆమె సీరియల్ నటే కాదూ.. తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో చేసింది. ప్రశాంత్, విజయ్ కాంత్ వంటి స్టార్ల పక్కన నటించింది. టాలీవుడ్‌లో కూడా చిన్నారి ముద్దుల పాప, సాహసం (ఓల్డ్) చిత్రాల్లో మెరిసింది. 2013లో రాకేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏ సీరియల్లోనూ నటించలేదు.

చాలా ముద్దుగా, బొద్దుగా ఉంటూ చాలా చలాకీగా ఉండే ఆమె ఇప్పుడు చూస్తే చాలా షాక్ అవుతారు. చాలా సన్నగా మారిపోయారు. తాజాగా ఓ యూట్యూబర్ ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. చూసిన వీక్షకులు ఆమెనేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తనను చూసి చాలా మంది ఫ్యాన్స్ ఏంటీ కావేరీ ఇలా అయిపోయావని అడుగుతున్నారట. అయితే తాను ఇలా అయిపోవడానికి కారణాలు వెల్లడించింది. ఓ సీరియల్ చేస్తున్న సమయంలో అమ్మ చనిపోయిందని, అప్పుడే తనకు పెళ్లైందట. ఆ సమయంలోనే తనకు థైరాయిడ్ వచ్చిందని, ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో సోదరుడు చనిపోయాడన్నారు. దీంతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే థైరాయిడ్‌కు టాబ్లెట్స్ వాడటంతో లావు పెరిగిపోయానని, అయితే వాటిని ఆపేయడంతో.. బరువు తగ్గుతూ వచ్చానన్నారు. తనకు ఇండస్ట్రీలో ఎవ్వరూ స్నేహితులు లేరని, తిరిగి నటించాలని ఉందని అన్నారు. ఆమె సీరియల్లో మీకు ఏదీ నచ్చిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి