iDreamPost

వీడియో: పాము హల్చల్.. పార్టు పార్టులుగా విడిపోయిన కొత్త బైక్!

వీడియో: పాము హల్చల్.. పార్టు పార్టులుగా విడిపోయిన కొత్త బైక్!

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. ఇళ్లు, కారు, బైక్ వంటివి కొనాలని కలలు కంటారు. రేయింబవళ్లు కష్టపడి తమ కలను సాకారం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు ఎంతో ముచ్చట పడి కొనుకున్న బైక్, కార్లు దెబ్బతింటాయి. ఎంతలా అంటే.. అసలు ఇవి కొత్త కారు, కొత్త బైకేనా అనే సందేహం వచ్చేలా దెబ్బతింటాయి. దీంతో సదరు వ్యక్తి ఎంతో ఆవేదన చెందుతాడు. అలానే ఓ వ్యక్తి కూడా ఎంతో ఆశగా కొత్త బైక్ ను కొనుగోలు చేశాడు. అయితే పాము వచ్చి అతడి ఆశలపై నీళ్లు చల్లింది. ఆ పాము కారణంగా కొత్త బైక్ పార్టు  పార్టులుగా విడిపోయింది. మరి.. అసలు కథ  ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో జిల్లా ఆర్టీవో కార్యాలయం ఉంది. ఇక్కడకు నిత్యం కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు వస్తుంటారు. వాహనాలను కొనుగోలు చేసిన అనంతరం తమ వాహనాన్ని ఆర్టీవో కార్యాలయానికి తీసుకు వచ్చి.. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుంటారు. అలానే ఇటీవల రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు కోసం కొత్త వాహనాలు ఆఫీస్ ముందు బారులు తీరాయి.  ఈ క్రమంలోనే ఆర్టీవో కార్యాలయం మైదానలో  కొత్త వాహనాలు నిలిపిన ప్రదేశంలో చిన్నసైజ్ కొండ చిలువ ప్రత్యక్షమైంది. దానిని చూసిన అక్కడి జనం పెద్ద ఎత్తున కేకులు వేస్తూ అటుఇటు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఆ కొండ చిలువ  పొదల్లోకి  వెళ్లింది.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. దీంతో ఘటన స్థలానికి  చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. పొదల్లోకి వెళ్లిన పామును పట్టుకునేందు వెళ్లాగా.. అక్కడే మరో పాము పొదల్లో నుంచి బయటకు పరుగు తీసింది. ప్రాణ భయంతో రిజిస్ట్రేషన్ కోసం పార్క్ చేసిన ఓ బైక్ లోకి దూరింది. కొండ చిలువును పట్టుకున్న అగ్నిమాపక సిబ్బంది.. బైక్ లో దూరిన మరో పాము కోసం తీవ్రంగా కృషి చేశారు. ఎలాగైన స్కూటర్ లోపలి దూరిన పామును పట్టుకోవాలని అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించింది. అగ్నిమాప సిబ్బంది శతవిధాలుగా ప్రయత్నించినా పాము మాత్రం చిక్కలేదు. దీంతో విసుగు చెందిన సిబ్బంది.. చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు.

పామును పట్టుకునేందుకు స్కూటర్ ను పార్ట్ పార్టులగా విడదీయాలని భావించారు. యజమాని అనుమతితో కొత్త బైక్ ను పార్టు పార్టులుగా విడదీశారు. అనంతరం పామును పట్టుకున్నారు.   ఈ సందర్భంగా అగ్నిమాప సిబ్బంది ..అక్కడి వారికి పలు సూచనలు చేశారు.  వాహనాలను ఒకే చోట ఎక్కువ సేపు పార్క్ చేస్తే..  బండిని తీసుకునేటప్పుడు ఒకసారి తనిఖీ చేసుకోవాలని తెలిపారు. పాములు బైక్ లోకి దూరితే బయటకు తీయడం చాలా కష్టమని, వాటిని పార్టులుగా విడదీయడం తప్ప వేరే మార్గం ఉండదని గ్రహించాలని సూచించారు. మరి.. ఆ కొత్త బైక్ యజమాని పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి