iDreamPost

చున్నీల వివాదం.. మగాళ్లపై సింగర్‌ చిన్మయి ఫైర్‌!

గతంలో మీటూ మూమెంట్ అప్పుడు తన గళం వినిపించి.. లైగింక వేధింపుల బారినపడ్డ వారికి అండగా నిలిచింది. అలాగే.. ఆడవాళ్లపై అసభ్యకరమైన పదజాలం చేసిన పురుషలకు...

గతంలో మీటూ మూమెంట్ అప్పుడు తన గళం వినిపించి.. లైగింక వేధింపుల బారినపడ్డ వారికి అండగా నిలిచింది. అలాగే.. ఆడవాళ్లపై అసభ్యకరమైన పదజాలం చేసిన పురుషలకు...

చున్నీల వివాదం.. మగాళ్లపై సింగర్‌ చిన్మయి ఫైర్‌!

చిన్మయి శ్రీపాద.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఈమె ఎంత ఫేమస్‌ అయ్యారో.. వివాదాలతో కూడా అంతే ఫేమస్‌ అయ్యారు. మహిళలకు సంబంధించిన సమస్యలపై సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తనపై ఎన్ని ట్రోల్స్‌ వచ్చినా కూడా వెనక్కు తగ్గటం లేదు. మహిళల సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా, చున్నీ వివాదంపై ఆమె స్పందించారు. మగవాళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇటీవల ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో యువకుడు మాట్లాడుతూ.. ‘‘ ఇప్పుడు ఈ న్యూ ట్రెండ్ ఫ్యాషన్ అనుకుంటా.. చున్నీ వేసుకోకుండా బయట తిరిగిన ప్రతీ ఒక్క అమ్మాయికి.. నాకు అనిపించింది నేను చెప్పుతున్నా. నన్ను మీరు అనుకోవచ్చు. చూసే చూపు మంచింది అయితే అన్నీ మంచిగా కనపడతాయని. కానీ, మీరు ఇది గుర్తు పెట్టుకోండి.. బయట ఉండే వాళ్ల అందరి చూపులు ఒకే రకంగా ఉండవు. మీరు వేసుకొనే రూ.100 చున్నీ వాళ్ల నుంచి మీకు.. మీ కుటుంబానికి కొన్ని కోట్ల రూపాయల విలువైన రెస్పెక్ట్ దొరుకుతుంది’’ అని పెర్కొన్నాడు.

ఇక, చిన్మయి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. అమె కూడా ఒక వీడియో చేసింది. అందులో ఆ యువకుడి మాటాలకు నవ్వుతూ.. ‘‘ అందరి దగ్గరా ఫోన్ ఉంది. అందరి ఫోన్లనో కెమెరా ఉంది. రీమిక్స్ చేసుకోవచ్చు. మ్యూజిక్ పెట్టుకుని చ.జ.జా అంటూ స్లోమోషన్ లో.. ఫిల్టర్ పెట్టుకుని ఎవరెవరో ఏదెదో చెప్పవచ్చు. ఏమైనా చేయవచ్చు. కానీ, ఈ అబ్బాయిలకి చున్నీ మీద అంత ఇంట్రస్ట్ ఎందుకో.. చున్నీ మీద అంత పట్టుదల ఉంటే వాళ్లే కొని వేసుకోవచ్చుగా.. అమ్మాయిలు.. చున్నీ కోట్ల రూపాయల రెస్పెక్ట్ ఇస్తుంది.

ఆ కోట్ల రూపాయలు ఉంటే.. హైదరాబాదులో చాలా విల్లాస్ ఉన్నాయి. రెండు ప్రాపర్టీస్ కొని.. ఒకటి అద్దెకి ఇచ్చి ఇంకోదానిలో మీరే హాయిగా లైఫ్ ని గడపండి. దయచేసి ఇలాంటి అబ్బాయిలను ప్రేమించకండి. డెటింగ్ చేసి, పెళ్లి చేసుకొవద్దు ’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది చిన్మయిని సపోర్టు చేస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి, చున్నీల విషయంలో సింగర్‌ చిన్మయి అబ్బాయిలకు కౌంటర్‌​ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి