iDreamPost

OTT News: గొంతులోకి బుల్లెట్ల వర్షం.. దేశాన్ని ఊపేసిన సింగర్‌ బయోపిక్‌.. డైరెక్ట్‌గా OTTలోకి

  • Published Feb 27, 2024 | 2:24 PMUpdated Mar 14, 2024 | 4:44 PM

ఓటీటీలో వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి . ఈ క్రమంలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఓ స్టార్ సింగర్ బయోపిక్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీలో వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి . ఈ క్రమంలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఓ స్టార్ సింగర్ బయోపిక్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 27, 2024 | 2:24 PMUpdated Mar 14, 2024 | 4:44 PM
OTT News: గొంతులోకి బుల్లెట్ల వర్షం.. దేశాన్ని ఊపేసిన సింగర్‌ బయోపిక్‌.. డైరెక్ట్‌గా OTTలోకి

భారతీయ సంగీత చరిత్రలో .. అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ సింగర్ “చమ్కీల”. ఇప్పుడు చమ్కీల పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఓ సినిమా తెరకెక్కింది. అయితే ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి అడుగుపెట్టనుంది. అనేక ఆర్థిక కష్టాలను చిన్నతనంలోనే ఎదుర్కొని.. ఓ స్నేహితుడి ద్వారా యావత్ భారతదేశం గుర్తించే సింగర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. సమస్యలను .. సందర్భానుసారంగా మలచుకుని.. ఆయన పాటలతో అందరిని ఆలోచించేలా చేసేవాడు. సంవత్సరంలో సుమారు 366 లైవ్ పెరఫార్మెన్సులు ఇచ్చేవారట ఆ దంపతులు. ఇక ఇప్పుడు ఆయన పూర్తి జీవిత చరిత్రను సినిమా రూపంలో తీసి అందరికి తెలియజేయనున్నారు. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

పంజాబ్, లూథియానా సమీపంలో దుగ్రి గ్రామంలో దళిత వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు “చమ్కీల” . అయితే ఆయన అసలు పేరు ధనిరామ్ కాగా.. సంగీత ప్రపంచానికి ఆయన పరిచయం అయిన తర్వాత అమర్ సింగ్ చమ్కీలాగా ఆయన పేరు మార్చుకున్నారు. అయితే, ఆయన ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలో 1988 మార్చి 8న మధ్యాహ్నం 2గంటలకు .. మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తున్న క్రమంలో.. కొందరు గుర్తు తెలియని దుండగులు .. చమ్కీల కారుకు అడ్డుపడి.. వెంటనే ఆయన గొంతులోకి తుపాకులతో వరుస కాల్పులు జరిపారు. ఆ దాడిలో చమ్కీల , అతని భార్య అమర్ జోత్ అక్కడికక్కడే మృతి చెందారు. పైగా ఆ సమయంలో అమర్ జోత్ గర్భవతిగా ఉన్నారు.

అయితే, అప్పట్లో ఈ దంపతుల మృతి పట్ల చాలా అనుమానులు వ్యక్తం అయ్యాయి. అప్పటి ఖలిస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా చమ్కీల పాటలు రాసినందుకు.. సిక్కు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. అసలు కథ ఏంటి ఆ తర్వాత ఏమైంది అనేది.. ఈ సినిమాలో చూపించారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు “చమ్కీల” చిత్రాన్ని డిల్జిత్ దొసాంజా, పరిణితి చోప్రా జోడిగా తెరకెక్కింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదల కోసం పంజాబ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 12నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గాయకుడి పేరు మారుమోగనుందని చెప్పి తీరాలి. మరి. చమ్కీల మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి