iDreamPost

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సింగరేణి కాలరీస్ లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను నుడు సంస్థ ఎండీ విడుదల చేయనున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సింగరేణి కాలరీస్ లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను నుడు సంస్థ ఎండీ విడుదల చేయనున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగనున్నది. ఇప్పటికే రేవంత్ సర్కార్ 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. సింగరేణిలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నేడు (ఫిబ్రవరి22) నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరామ్ నాయ‌క్‌ వెల్లడించారు.

ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంస్థ సీఎండీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క సీఎండీ బలరాం నాయక్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్‌, 168 ఇంటర్నల్‌ పోస్టులకు ఈరోజు(గురువారం) నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 485 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించనుంది సింగరేణి. ఈ రిక్రూట్ మెంట్ తో పాటు సంస్థలో కారుణ్య నియామకాలను చేపట్టాలని.. ఈ ఏడాదిలో 1000 వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని భట్టీ అన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని 35ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.

ఇక సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగమైన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇటీవల సింగరేణి సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పించడంపై అవగాహన ఓప్పందం కుదుర్చుకుంది. దీంతో కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా అందించనున్నారు. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతా కల్పించినట్లు అవుతుందని భట్టి తెలిపారు. అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఈ నెల 26వ తేదీన ఆవిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఉప ముఖ్యమంత్రి భట్టీ సింగ‌రేణి అధికారులను ఆదేశించారు. ఇక సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి