iDreamPost
android-app
ios-app

రికార్డులు బద్దలు కొడుతున్న టిల్లు.. ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి..

Tillu Square Crossed 100 Crore Gross: సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ జంటగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ మూవీ కేవలం 9 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

Tillu Square Crossed 100 Crore Gross: సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ జంటగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ మూవీ కేవలం 9 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

రికార్డులు బద్దలు కొడుతున్న టిల్లు.. ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి..

టాలెంట్ ఎవడీ సొత్తు కాదు.. టాలెంట్ ఉన్న వాడిని ఆపడం ఎవరి తరం కాదు. ఈ మాటలు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు కచ్చితంగా సూట్ అవుతాయి. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్ట పడండి అనే లైన్స్ సిద్ధు బాగా వంట పట్టించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో సిద్దు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ జంటగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఫీట్ ని సాధించడానికి టిల్లు స్క్వేర్ మూవీకి కేవలం 9 రోజులు మాత్రమే పట్టడం విశేషం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టిల్లు గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్లోనే అద్భుతమైన ఘనతను సాధించాడు. తాను నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఏకంగా రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మూవీని కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కిస్తే.. ఇప్పుడు రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మొత్తం 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.101.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.  అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జోరు ఉంకా తగ్గలేదు. మరిన్ని రికార్డులు కొల్లగొట్టే దిశగా టిల్లూ స్క్వేర్ మూవీ పరుగులు పెడుతోందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అందరూ టిల్లుని ఫాలో అయిపోయారు. అదే తరహా భాష, యాస, డ్రెస్సింగ్ తో హైదరాబాద్ మొత్తం ఊగిపోయింది. ఇప్పటికీ ఊగుతూనే ఉంది.

100 crores for Tillu square

అలాంటిది భారీ అంచనాలతో ఈ టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా.. అంతకన్నా ఎక్కువగానే టిల్లు స్వ్కేర్ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్ ని ప్రేక్షకులతో కలిసి పంచుకునేందుకు చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను సందర్శిస్తూ ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఫ్యాన్స్ కలిసి సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ మూవీలో అనుపమ కూడా బిగ్ అసెట్ అనే చెప్పాలి. మొదటి పార్ట్ లో రాధికా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ కంటే లిల్లీ పాత్రకు డబుల్ రియాక్షన్ వచ్చింది. అలాగే ఇదే ఊపులో టిల్లు క్యూబ్ కూడా ఉంది అంటూ ఆడియన్స్ సర్ ప్రైజ్ చేశారు. అయితే మరోసారి స్క్రీన్ మీదకు టిల్లు ఎప్పుడు వస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టిల్లు ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇంక స్టార్ బాయ్ సిద్ధు విషయానికి వస్తే.. ఈ సక్సెస్ సిద్ధుకి చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ స్టేజ్ కి రావడానికి సిద్ధుకి ఏకంగా 12 ఏళ్ల సమయం పట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఒక స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. సిద్ధు నుంచి సినిమా అంటే పక్కా హిట్టు అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ఇంత దూరం రావడానికి అతనికి ఎదురైన అవమానాలే కారణంగా చెప్తుంటాడు. కెరీర్ ప్రారంభంలో తన ముఖం మీద ఉన్న మచ్చలు చూపించి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి అవమానించాడని.. అదే అతనిలో కసి పెంచింది అని తెలిపాడు. ఇప్పుడు ఈ సక్సెస్ తో టిల్లు తన కెరీర్ లో జోరు పెంచేశాడు. మరి.. టిల్లు స్క్వేర్ రూ.వంద కోట్ల క్లబ్ లో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026