iDreamPost

Shyam Singha Roy : హిందీ లో రీమేక్ కాబోతున్న నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’.

Shyam Singha Roy : హిందీ లో రీమేక్ కాబోతున్న నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న యాక్షన్ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.. ఈ సినిమా టీజర్ తో ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలను పెంచేసింది. పునర్జన్మ కాన్సెప్ట్ తో కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ చిత్రం, నాని సంఘసంస్కర్తగా కనిపించనున్నాడు..అయితే, ఈ సినిమాని బాలీవుడ్‌లో భారీ రీమేక్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం, ఓ తెలుగు నటుడు ఈ సినిమా యొక్క హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడని టాక్. అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్‌తో పాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకిటించారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం రీమేక్ హక్కుల ఒప్పందాలు కుదిరిన తర్వాత హిందీ రీమేక్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తారు.

ప్రస్తుతం నాని చేతిలో ‘అంటే సుందరానికి’, ‘దసరా’ అనే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ 2021 డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read : Marakkar : అసలు శబ్దమే లేని అరేబియా సింహం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి