iDreamPost

హార్ధిక్‌ పాండ్యా స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించిన గుజరాత్‌!

  • Author Soma Sekhar Published - 03:58 PM, Mon - 27 November 23

అందరూ అనుకున్నట్లుగానే హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరాడు. క్యాష్ డీల్ లో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో గుజరాత్ జట్టు పగ్గాలు చేపట్టబోయేది ఎవరని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది గుజరాత్ టైటాన్స్.

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచి తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా గత సీజన్ లో విఫలం అయిన బ్యాటర్లను విడుదల చేశాయి యాజమాన్యాలు. ఈ రిటైన్ ప్రాసెస్ లో కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్లను కూడా వదులుకున్నాయి కొన్ని జట్లు. ఇక అందరూ అనుకున్నట్లుగానే హార్దిక్ పాండ్యా సొంత గూటికి చేరాడు. క్యాష్ డీల్ లో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఆ జట్టుకు సారథి ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు తాజాగా ఓ వీడియో రూపంలో సమాధానం ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. మా కెప్టెన్ ఇతడే అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఐపీఎల్ లో గత రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్ ను ముందుండి విజయ పథంలో నడిపించిన పాండ్యా ఆ జట్టును వీడాడు. టోర్నీలో పాల్గొన్న తొలి సీజన్ లోనే గుజరాత్ కు టైటిల్ అందించి అరుదైన ఘనత సాధించాడు ఈ ఆల్ రౌండర్. అయితే ఆదివారం జరిగిన ట్రేడింగ్ లో పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో కెప్టెన్ గా ఉన్న పాండ్యా వెళ్లిపోవడంతో.. గుజరాత్ ను నడిపించేది ఎవరు? అన్న ప్రశ్న ఎదురైంది. చాలా మంది సీనియర్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఎంపిక చేసింది.

ఈ క్రమంలోనే అతడి అపాయింట్ మెంట్ కు సంబంధించి యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ‘కెప్టెన్ కాలింగ్’ అంటూ ఓ వీడియోను సైతం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక టీమిండియాలో నిలకడగా రాణిస్తూ.. సుస్థిర స్థానాన్ని జట్టులో ఏర్పరచుకున్నాడు గిల్. అయితే కెప్టెన్ గా అనుభవం, సీనియర్ కాకపోవడంతో.. గుజరాత్ జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ నియామకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి