iDreamPost
android-app
ios-app

Shreyas Iyer: నేను బౌలింగ్ చేయకపోవడానికి అదొక్కటే కారణం: శ్రేయస్ అయ్యర్

  • Author Soma Sekhar Updated - 03:33 PM, Tue - 5 December 23

నాకూ బౌలింగ్ వేయాలనుందని, కానీ ఆ ఒక్క కారణంతోనే నేను బౌలింగ్ వేయట్లేదని చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.

నాకూ బౌలింగ్ వేయాలనుందని, కానీ ఆ ఒక్క కారణంతోనే నేను బౌలింగ్ వేయట్లేదని చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.

  • Author Soma Sekhar Updated - 03:33 PM, Tue - 5 December 23
Shreyas Iyer: నేను బౌలింగ్ చేయకపోవడానికి అదొక్కటే కారణం: శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్.. టీమిండియాలో కీలక ప్లేయర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక అద్భుతమైన ఆటతీరుతో అతి తక్కువ కాలంలోనే జట్టులో స్టార్ ప్లేయర్ గా మంచి గుర్తింపు కూడా దక్కించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసి.. సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు 6 రన్స్ తో విజయం సాధించి.. సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. కాగా.. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకూ బౌలింగ్ చేయాలనుంది.. కానీ అదొక్కటే కారణం చేత బౌలింగ్ చేయట్లేదు. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శ్రేయస్ అయ్యర్ మనకు బ్యాటర్ గానే తెలుసు. కానీ అతడిలో మంచి బౌలర్ కూడా ఉన్నాడని చాలా తక్కువ మందికే తెలుసు. ఇక ఇదే విషయాన్ని ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. తన బౌలింగ్ గురించి శ్రేయస్ అయ్యర్..”నాకూ బౌలింగ్ చేయాలని ఎంతో ఆశగా ఉంది. కానీ వెన్ను గాయం కారణంగా దానికి దూరంగా ఉంటున్నా. ఫిట్ నెస్ అండ్ మెంటల్ కండిషనింగ్ కోచ్ సలహాల వల్ల నేను బౌలింగ్ చేయడం లేదు. ఇలా ఉండటం నిజంగా నాకు నిరాశనే కలిగిస్తోంది” అంటూ జియో సినిమాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. అయ్యర్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కేవలం 45 బంతులు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇన్ని బంతులు సంధించినా.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే దేశవాళీ క్రికెట్ లో మాత్రం అయ్యర్ 10 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ప్రస్తుతం ఆసీస్ సిరీస్ ముగియడంతో.. సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమవుతున్నాడు. మరి బౌలింగ్ పై తన అభిప్రాయాలను పంచుకున్న అయ్యర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.