iDreamPost
android-app
ios-app

శ్రేయాస్ అయ్యర్‌పై యువరాజ్ ఫైర్! తెరపైకి కొత్త రచ్చ!

  • Published Oct 09, 2023 | 1:51 PM Updated Updated Oct 09, 2023 | 1:51 PM
  • Published Oct 09, 2023 | 1:51 PMUpdated Oct 09, 2023 | 1:51 PM
శ్రేయాస్ అయ్యర్‌పై యువరాజ్ ఫైర్! తెరపైకి కొత్త రచ్చ!

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తొలుత ఆసీస్‌ను 199 పరుగులకే కట్టడి.. మ్యాచ్‌ సులువుగా గెలుస్తుందని అనుకున్నా.. బ్యాటింగ్‌కు దిగి ఆరంభంలోనే 2 పరుగులకు మూడు వికెట్లు కోల్పోవడంతో టెన్షన్‌ మొదలైంది. కానీ, సీనియర్‌ ప్రోస్‌ విరాట్‌ కోహ్లీ-కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడి టీమిండియాకు విజయం అందించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం అయ్యారు. ముగ్గురు కూడా డకౌట్‌ కావడం గమనార్హం. అయితే.. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఎటాక్‌ చేద్దాం అనుకుని వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. శ్రేయస్‌ అవుటైన తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌, లెజెండరీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఫైర్‌ అయ్యాడు.

‘ఇన్నింగ్స్‌ను రీబిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. శ్రేయస్ అయ్యర్ మెరుగ్గా ఆలోచించాల్సింది. కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేయడం లేదో అర్థం కావడంలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిని తట్టుకుని ఆడాలి’ అంటూ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు. అయితే.. యువీ చేసిన ఈ ట్వీట్‌పై శ్రేయస్‌ అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా యువ క్రికెటర్‌ అర్షదీప్‌ సింగ్‌ విషయంలో యువీ స్పందించిన తీరుకు, ఇప్పుడు శ్రేయస్‌ గురించి యువీ చేసిన కామెంట్‌కు అస్సలు సంబంధం లేదంటూ మండిపడుతున్నారు.

గతంలో అర్షదీప్‌ సింగ్‌ పాకిస్థాన్‌పై ఓ క్యాచ్‌ను జారవిడిచిన సమయంలో.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది, పైగా అర్షదీప్‌ సింగ్‌ యువ ఆటగాడు అతనిపై ఎంత ప్రెషర్‌ ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి సమయంలో అర్షదీప్‌ను విమర్శించడం మానేసి.. అతనికి మద్దతుగా నిలవాలని కోరాడు. కానీ, ఇప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌ విషయానికి వచ్చే సరికి.. మాత్రం ఒత్తిడి తట్టుకుని ఆడాలని అంటున్నాడు. అర్షదీప్‌ సింగ్‌లా అయ్యర్‌ కూడా యువ క్రికెటర్‌ అనే విషయం యువీ మర్చిపోయినట్లు ఉన్నాడంటూ అయ్యర్‌ ఫ్యాన్స్‌ యువీకి చురకలు అంటిస్తున్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌లో టీమిండియాకు 4 స్థానంలో అయ్యర్‌ను మించిన ప్లేయర్‌ లేడని, కావాలంటే అతని రికార్డులు చూసుకోవాలని అంటున్నారు. మరి శ్రేయస్‌ అయ్యర్‌పై యువీ చేసిన వ్యాఖ్యలతో పాటు, అయ్యర్‌ అభిమానులు స్పందిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాండ్యా నువ్వింక మారవా? అప్పుడు తిలక్‌.. ఇప్పుడు రాహుల్‌!