iDreamPost

టైటిల్ గెలిచినా.. అయ్యర్ పై విమర్శలు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

IPL 2024 టైటిల్ గెలిచినా గానీ..  కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

IPL 2024 టైటిల్ గెలిచినా గానీ..  కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

టైటిల్ గెలిచినా.. అయ్యర్ పై విమర్శలు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

ఐపీఎల్ 2024 సీజన్ లో ముందు నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన కేకేఆర్.. ఆ జోరుతోనే ముచ్చటగా మూడో టైటిల్ ను ముద్దాడింది. దశాబ్దకాలం నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చూపించిన కేకేఆర్, సన్ రైజర్స్ ను మట్టికరిపించింది. అయితే టైటిల్ గెలిచినా గానీ..  కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అయ్యర్ పై ఎందుకు విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2024 టోర్నీలో కేకేఆర్ ను తన నాయకత్వంలో విజయవంతంగా నడిపించాడు. సీజన్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కేకేఆర్.. టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇదిలా ఉండగా.. కేకేఆర్ టైటిల్ గెలిచిన తర్వాత ఆటగాళ్లు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. గ్రౌండ్ లో గెత్తుతూ.. తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. విన్నింగ్ సెలబ్రేషన్స్ లో శ్రేయస్ అయ్యర్ చేసిన పని వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024 ట్రోఫీ గెలిచిన తర్వాత కప్ ను అందుకున్న కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టేజ్ పైకి వచ్చేే టైమ్ లో విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే అతడిపై విమర్శలకు దారితీసింది. అయ్యర్ చేసుకున్న సెలబ్రేషన్స్ అచ్చం అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ సెలబ్రేట్ చేసుకున్న విధంగా చేసుకున్నాడు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ సాధించిన తర్వాత మెస్సీ ఏ విధంగానైతే వేడుకలు చేసుకున్నాడో.. అచ్చం అలాగే అయ్యర్ కూడా చేశాడు. దీంతో సెలబ్రేషన్స్ కూడా కాపీ పేస్టేనా? కొంచెమైనా మార్చొచ్చు కదా అయ్యర్ సాబ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీకంటూ ఓ క్యారెక్టర్ ఉండాలి కదా అయ్యర్ అంటూ విమర్శిస్తున్నారు. నిజంగానే ఈ రెండు వీడియోలు ఒకేలా ఉన్నాయి. మెస్సీని డిటో దింపేశాడు శ్రేయస్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి సెలబ్రేషన్స్ కు కూడా కాపీ కొట్టిన అయ్యర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి