• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » sports » Shraddha Kapoor Intresting Insta Story About Mohammed Siraj

చెడగొట్టాడు! ఇప్పుడేం చేయాలో సిరాజ్‌నే అడగాలి: శ్రద్ధాకపూర్‌

  • By SNP Published Date - 01:15 PM, Mon - 18 September 23 IST
చెడగొట్టాడు! ఇప్పుడేం చేయాలో సిరాజ్‌నే అడగాలి: శ్రద్ధాకపూర్‌

ఆసియా కప్‌ 2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించిన పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌పై నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు సిరాజ్‌ను ఆకాశానికెత్తేస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ, ప్రభాస్‌ సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించిన శ్రద్ధా కపూర్‌ సైతం సిరాజ్‌ అవుట్‌ స్టాండింగ్‌ ప్రదర్శనపై తనదైన శైలిలో స్పందించింది. ‘ఈ ఫ్రీమ్‌ టైమ్‌లో ఏం చేయాలో సిరాజ్‌నే అడగాలి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది.

సాధారణంగా వన్డే మ్యాచ్‌ అంటే దాదాపు 8 గంటలు జరగాలి. కానీ, ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ కేవలం 3 గంటల్లో ముగిసిపోయింది. 50, 50.. 100 ఓవర్ల పాటు సాగాల్సిన మ్యాచ్‌ కాస్తా.. 21.3 ఓవర్లలోనే ముగిసిపోయింది. 15.2 లో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్‌ కావడం, 51 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఓపెనర్లు గిల్‌-ఇషాన్‌ కేవలం 6.1 ఓవర్లలో కొట్టేయడంతో వన్డే మ్యాచ్‌.. టీ20 టైమ్‌లోనే ముగిసింది. దీనంతటికీ కారణం మొహమ్మద్‌ సిరాజ్‌. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు మొత్తం 6 వికెట్ల పడగొట్టి.. శ్రీలంకను కుప్పకూల్చాడు.

దీంతో.. సండే రోజు భారత్‌-శ్రీలంక మధ్య ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ను చూస్తూ.. గడపేద్దాం అనుకున్న వారందరికీ షాక్‌ ఇచ్చాడు సిరాజ్‌. మూడు గంటల్లోనే మ్యాచ్‌ ముగిసిపోవడంతో.. తర్వాత టైమ్‌లో ఏం చేయాలో చాలా మంది దగ్గర ప్లాన్స్‌ లేకుండా అయిపోయాయి. ఇలా సిరాజ్‌ శ్రద్ధా కపూర్‌ ప్లాన్స్‌ అన్ని పాడు చేసినట్లు ఉన్నాడు. అందుకే.. మిగతా ఖాళీ టైమ్‌లో ఏం చేయాలో సిరాజ్‌నే అడగాలంటూ.. సరదాగా పేర్కొంది. మరి ఫైనల్‌లో సిరాజ్‌ ప్రదర్శనతో పాటు.. శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టా స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#ShraddhaKapoor #MohammadSiraj #AsianCup2023 pic.twitter.com/eVqdzkJeGo

— Sayyad Nag Pasha (@nag_pasha) September 18, 2023

ఇదీ చదవండి: 23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!

Tags  

  • asia cup 2023
  • cricket news
  • Mohammed Siraj
  • Shraddha Kapoor

Related News

పాక్ టీమ్ పై రమీజ్ రాజా ఆగ్రహం.. చెత్త ప్రదర్శన అంటూ..!

పాక్ టీమ్ పై రమీజ్ రాజా ఆగ్రహం.. చెత్త ప్రదర్శన అంటూ..!

వరల్డ్ కప్ 2023కి సర్వం సిద్ధమవుతోంది. వార్మప్ మ్యాచులతో జట్లు ఫామ్ లోకి వస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల మీద దృష్టి సారిస్తున్నారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా అన్నీ జట్లు కృషి చేస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ అనగానే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ జట్లు అని కొన్ని ఉంటాయి. వాటిలో పాకిస్తాన్ పేరు కూడా వినిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గానే పాక్ జట్టు ఇండియాలో అడుగుపెట్టింది. కానీ, వాళ్ల క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా […]

11 hours ago
వీడియో: హ్యాట్రిక్ తో ఫామ్ లోకి స్టార్క్.. టీమిండియాకి ఇది వేకప్ కాల్!

వీడియో: హ్యాట్రిక్ తో ఫామ్ లోకి స్టార్క్.. టీమిండియాకి ఇది వేకప్ కాల్!

16 hours ago
వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?

వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?

1 day ago
ఇదే నా చివరి వరల్డ్‌ కప్‌ కావొచ్చు.. టీమిండియా స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

ఇదే నా చివరి వరల్డ్‌ కప్‌ కావొచ్చు.. టీమిండియా స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

1 day ago
కోహ్లీకి పోటీగా ఫీల్డింగ్‌ ఫొటోలను షేర్‌ చేసిన యువీ, జాంటీ రోడ్స్‌! ఎవరు బెస్ట్‌?

కోహ్లీకి పోటీగా ఫీల్డింగ్‌ ఫొటోలను షేర్‌ చేసిన యువీ, జాంటీ రోడ్స్‌! ఎవరు బెస్ట్‌?

1 day ago

తాజా వార్తలు

  • వీడియో: క్రికెట్ మ్యాచ్ లో గొడవ.. ఆరుగురికి గాయాలు!
    10 hours ago
  • iPhone 13: రూ.59,900 ఐఫోన్ 13.. కేవలం రూ.39,999కే!
    10 hours ago
  • లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరోతో సినిమా!
    10 hours ago
  • చిక్కుల్లోకి చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!
    10 hours ago
  • షాకింగ్: ఆత్మహత్య చేసుకున్న మాజీ MLA కూతురు!
    11 hours ago
  • అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అయాన్
    11 hours ago
  • విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన! ఏం చేశాడో తెలుసా?
    12 hours ago

సంఘటనలు వార్తలు

  • తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!
    12 hours ago
  • అనుపమకు చేదు అనుభవం.. రెండేళ్లు సినిమాలకు దూరం!
    12 hours ago
  • Bigg Boss 7 Telugu: లీక్ చేసిన నాగార్జున.. హౌస్ లోకి రాబోతోంది వీళ్లే!
    12 hours ago
  • వీడియో: అడ్డంగా బుక్కైన సందీప్.. వీడియో పెట్టి మరీ పరువు తీస్తున్నారు!
    13 hours ago
  • వీడియో: గుడిలో హుండీ డబ్బులు కొట్టేసిన పూజారి!
    13 hours ago
  • TTD కీలక నిర్ణయం.. భక్తులకు ఆ టోకెన్లు నిలిపివేత!
    13 hours ago
  • లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తున్నారు: మాజీ మంత్రి పేర్ని నాని
    14 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version