iDreamPost

అలెర్ట్: మన వ్యక్తిగత డేటాని అమ్మేస్తున్నారు .. ప్రమాదంలో 75లక్షల మంది!

  • Published Apr 10, 2024 | 7:49 PMUpdated Apr 10, 2024 | 7:54 PM

ఒక వ్యక్తికీ సంబంధించిన పర్సనల్ డేటా అనేది.. అన్నిటికంటే విలువైంది. ఒకవేళ ఆ డేటా కనుక ఎక్కడైనా లీక్ అయితే ఆ వ్యక్తి ప్రాణానికే అది చాలా ప్రమాదం. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ సంస్థ వారి యూజర్స్ డేటా ను అమ్మకానికి పెట్టిందనే వార్తలు అందరిని కలవరపెడుతున్నాయి.

ఒక వ్యక్తికీ సంబంధించిన పర్సనల్ డేటా అనేది.. అన్నిటికంటే విలువైంది. ఒకవేళ ఆ డేటా కనుక ఎక్కడైనా లీక్ అయితే ఆ వ్యక్తి ప్రాణానికే అది చాలా ప్రమాదం. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ సంస్థ వారి యూజర్స్ డేటా ను అమ్మకానికి పెట్టిందనే వార్తలు అందరిని కలవరపెడుతున్నాయి.

  • Published Apr 10, 2024 | 7:49 PMUpdated Apr 10, 2024 | 7:54 PM
అలెర్ట్: మన వ్యక్తిగత డేటాని అమ్మేస్తున్నారు .. ప్రమాదంలో 75లక్షల మంది!

ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందో.. సైబర్ నేరాలు కూడా అంతే పెరిగాయి. మనకి తెలియకుండా ఇప్పటివరకు మన ఫోన్ నెంబర్, పర్సనల్ డీటెయిల్స్ చాలా కంపెనీస్ లో ఇచ్చి ఉంటాము. ఎప్పుడైనా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొన్నప్పుడైతే అప్పుడు మన ఫోన్ నెంబర్స్, ఇమెయిల్ ఐడి, అడ్రస్ లు ఇస్తూ ఉండడం సహజం. ఇప్పుడు అటువంటి ఓ సంస్థ ఇటువంటి డేటాను అమ్మకానికి పెట్టిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థ మరేదో కాదు.. దేశంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణ పొంది.. ఒక బ్రాండ్ గా నిలిచిపోయిన బోట్ సంస్థ. తక్కువ ధరల్లో మంచి ప్రొడక్ట్స్ సేల్ చేయడంతో.. ఈ సంస్థకు ఎక్కువమంది యూజర్స్ పెరిగారు. స్మార్ట్ వాచ్, నేక్ బ్యాండ్, ఎయిర్ పోడ్స్ ఇలాంటి వాటికి ప్రత్యేకమైన బ్రాండ్ కేవలం బోట్ మాత్రమే అనే రేంజ్ కు ఈ సంస్థ పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే సంస్థ ఆ అందరి నమ్మకాన్ని కోల్పోబోతుంది. బోట్ పరికరాలను వినియోగిస్తున్న వారందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పి తీరాలి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఫోర్బ్స్ ఒక నివేదికలో ఈ షాకింగ్ న్యూస్ ను బయటపెట్టింది. బోట్ కంపెనీలో ఉండే 75 లక్షల వినియోగదారుల పర్సనల్ డేటా అంతా కూడా చోరీకి గురైనట్లు వెల్లడించింది. ఇందులో వినియోగదారుల పేర్లు, వాటి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడిలు ఇలా అన్ని కూడా డార్క్ వెబ్ లో కనిపిస్తున్నట్లు.. ఫోర్బ్స్ పేర్కొంది. ఈ డేటా మొత్తాన్ని కూడా షాపిఫైగై అనే ఒక హ్యాకర్ ఏప్రిల్ 5న డార్క్ వెబ్ లో పోస్ట్ చేసినట్లు సమాచారం. దీని కారణంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకవేళ సైబర్ నేరగాళ్లకు దొరికితే కనుక.. ఈ వినియోగదారులు ప్రమాదంలో ఉన్నట్లే. రానున్న రోజుల్లో కూడా కస్టమర్లకు.. ఆర్థిక మోసాలు, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ గురయ్యే అవకాశాలు ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కస్టమర్ల పర్సనల్ విషయాలు బయటకు వెళ్లడమే కాకుండా.. బోట్ సంస్థ తన యూజర్స్ ను కోల్పోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే దీనికి సంబంధించి చట్ట పరమైన సమస్యలను కూడా ఆ కంపెనీ ఎదుర్కోనుంది.

ఇకపోతే డార్క్ వెబ్ లో ఉన్న డేటా.. కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా కేవలం రెండు నుంచి మూడు యూరోలకు ఈ డేటా మొత్తాన్ని అమ్మకానికి పెట్టారట. మరి బోట్ సంస్థ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునుందనే విషయంపై అందరికి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దీని కారణంగా యూజర్స్ కు మరింత ప్రమాదం కలుగనుంది. కాబట్టి వీలైనంత త్వరగా బోట్ సంస్థ దీనిపై చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో బోట్ వినియోగదారులు.. తక్షణమే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. వివిధ అకౌంట్లకు ఒకే పాస్ వర్డ్ పెట్టుకున్న వ్యక్తులు .. వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలని.. అలాగే అన్నిటికి టూ స్టెప్ వెరిఫికేషన్ ఏర్పాటు చేసుకోవాలని.. నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి