iDreamPost

Shoaib Malik: షోయబ్ మాలిక్​పై సంచలన ఆరోపణలు.. T20 కాంట్రాక్ట్ నుంచి ఔట్!

  • Published Jan 27, 2024 | 8:40 AMUpdated Jan 27, 2024 | 8:46 AM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఈ మధ్యే మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహంపై వివాదం నడుస్తున్న టైమ్​లోనే అతడి మీద సంచలన ఆరోపణలు వస్తున్నాయి.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఈ మధ్యే మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహంపై వివాదం నడుస్తున్న టైమ్​లోనే అతడి మీద సంచలన ఆరోపణలు వస్తున్నాయి.

  • Published Jan 27, 2024 | 8:40 AMUpdated Jan 27, 2024 | 8:46 AM
Shoaib Malik: షోయబ్ మాలిక్​పై సంచలన ఆరోపణలు.. T20 కాంట్రాక్ట్ నుంచి ఔట్!

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియా కేంద్రంగానూ అతడి మీద ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇవ్వడం.. పాక్ నటి సనా జావేద్​తో మరో వివాహంతో ఒక్కసారిగా షోయబ్ చర్చనీయాంశంగా మారాడు. సనా జావేద్​ను మూడో పెళ్లి చేసుకోవడంతో సానియా నుంచి అతడు విడిపోయిన విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. అయితే ఈ విడాకులకు అక్రమ సంబంధమే కారణమని టాక్. సనా జావేద్​తో మూడేళ్లుగా మాలిక్ రిలేషన్​లో ఉన్నాడని.. దీని వల్లే సానియా అతడికి విడాకులు ఇచ్చిందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అందరూ మాలిక్​ను విమర్శిస్తున్నారు. ఓ క్రికెటర్ ఇలాగేనా వ్యవహరించేది? భార్య ఉండగా ఇలా చేయడమేంటని ఫైర్ అవుతున్నారు. ఈ తరుణంలో మాలిక్​పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.

మొన్న మూడో పెళ్లి.. నిన్న మూడు నో బాల్స్​తో వార్తల్లో నిలిచిన షోయబ్ మాలిక్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్​తో మరోమారు నెట్టింట వైరల్​గా మారాడు. బంగ్లాదేశ్​ ప్రీమియర్ లీగ్​లో ఫార్చూన్ బరిషల్ టీమ్​కు ఆడుతున్న అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అర్ధంతరంగా టోర్నీ నుంచి వైదొలిగి దుబాయ్​కు మాలిక్ వెళ్లిపోయాడని తెలుస్తోంది. రీసెంట్​గా టీ20 క్రికెట్​లో 13 వేలకు పైగా పరుగులు చేసిన ఆసియా బ్యాటర్​గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన మాలిక్.. బీపీఎల్​లో ఖుల్నా టైగర్స్​తో మ్యాచ్​లో ఒకే ఓవర్​లో 3 నోబాల్స్ వేశాడు. దీంతో అతడు ఫిక్సింగ్​కు పాల్పడ్డాడని ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈ కారణం వల్లే మాలిక్​ను ఫార్చూన్ ఫ్రాంచైజీ తప్పించిందని.. అందుకే టోర్నీ నుంచి అర్ధాంతరంగా దుబాయ్​కు వెళ్లిపోయాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

shoaib malik match fixing

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, టీమ్ నుంచి తొలగింపు వ్యవహారంపై అటు బీపీఎల్ లేదా ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం.. షోయబ్​తో ఉన్న కాంట్రాక్ట్​ను ఫార్చూన్ బరిషల్ రద్దు చేసుకుందని సమాచారం. మ్యాచ్ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడనే అనుమానాలతోనే ఈ డిషిషన్ తీసుకుందట. స్పిన్నర్లు సాధారణంగా నోబాల్స్ వేయరు. మాలిక్ ఎప్పుడూ క్రమశిక్షణతో బాల్స్ వేస్తుంటాడు. అలాంటి ఒకే ఓవర్​లో మూడు నోబాల్స్ వేయడాన్ని బరిషల్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించిందట.

ఫ్రాంచైజీ ఓనర్ మిజనుర్ రెహ్మాన్ ఈ న్యూస్​ను కన్ఫర్మ్ చేశారని టాక్. అయితే తన మీద వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలపై షోయబ్ మాలిక్ రియాక్ట్ అయ్యాడు. ఈ ఆరోపణలను కొట్టిపడేసిన పాక్ మాజీ కెప్టెన్.. ఈ రూమర్లపై స్పందించాల్సిన అవసరం లేదన్నాడు. బరిషల్ టీమ్​తో తెగదెంపులు జరిగినట్లు వస్తున్న న్యూస్ కట్టుకథని.. దీని మీద ఇప్పటికే తమ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్​తో డిస్కస్ చేశానన్నాడు. ఏ డిసిషన్ అయినా సంయుక్తంగా తీసుకుంటామని తెలిపాడు. దుబాయ్​లో అప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. మరి.. మాలిక్​ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి