SNP
SNP
వన్డే వరల్డ్ కప్‌ల్లో టీమిండియాపై తమకున్న చెత్త రికార్డును పాకిస్థాన్ మరింత మెరుగుపర్చకుంది. శనివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కి ముందు వన్డే వరల్డ్ కప్పుల్లో 7 సార్లు టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించింది ఒక్కసారి కూడా పాక్ ఇండియాపై గెలిచింది లేదు. శనివారం మ్యాచ్‌తో ఆ అది కాస్త 8-0గా మారింది. ఈ విజయంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయితే.. ఓటమితో పాక్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. సాధారణ క్రికెట్ అభిమానులే కాదు.. పాక్ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్థాన్ టీమ్ ప్రదర్శనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ దిగ్గజ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఏకంగా పాకిస్థాన్ టీమ్ పరువుతీసేలా మాట్లాడాడు.
అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు ఆరంభంలో మంచి స్టార్ లభించిందని, మంచి కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉండి కూడా చెత్త ప్రదర్శన చేసిందన్నాడు. అలాగే ఓపెనర్లు షఫీక్ అబ్దుల్లా, ఇమామ్ ఉల్ హక్, బాబర్, రిజ్వాన్‌లకు మంచి స్టార్ట్ లభించినా.. పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారని, పాకిస్థాన్ దగ్గర అసలు సిచ్యూయేషన్‌ని క్యాపిటలైజ్ చేసుకునే టాలెంట్ లేదని, మంచి స్టార్ట్ దొరికిన తర్వాత కూడా పాకిస్థాన్ పెద్ద స్కోర్ చేయలేదని అన్నాడు. పిచ్ అద్భుతంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. కూడా అనవసరంగా క్రాస్ బ్యాడ్ షాట్లు ఆడి వికెట్లు ఇచ్చారంటూ విమర్శించారు. అలాగే టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ముఖ్యంగా రోహిత్ శర్మ ఎంతో అద్భుతంగా కెప్టెన్సీ చేశాడంటూ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు అక్తర్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పాక్ ఓపెనర్లు కూడా ఆరంభంలో బాగానే ఆడారు. ముఖ్యంగా సిరాజ్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టారు. కానీ, 41 పరుగుల వద్ద సిరాజే టీమిండియాకు తొలి బ్రేక్‌త్రూ అందించాడు. పాండ్యా మరో ఓపెనర్ ఇమామ్‌ను అవుట్ చేశాడు. బాబర్ అజమ్-రిజ్వాన్ బాగా ఆడుతూ కనిపించినా.. ఈ జోడిని సిరాజ్ విడదీశాడు. 50 రన్స్ చేసి మంచి ఊపుమీదున్న బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పేశాడు. అక్కడ నుంచి పాక్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్‌లా కూలిపోయింది. కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా, పాండ్యా, కుల్దీప్, జడేజా తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు. 192 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 30.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఊదిపారేసింది. రోహత్ శర్మ 86, శ్రేయస్ అయ్యర్ 53 (నాటౌట్) రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో పాక్ ప్రదర్శనతో పాటు అక్తర్ కామెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a waste of opportunity on a great batting wicket. Disappointed. Very disappointed. pic.twitter.com/2EnC1z9zni
— Shoaib Akhtar (@shoaib100mph) October 14, 2023
ఇదీ చదవండి: పాకిస్థాన్‌పై టీమిండియా విజయం! బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు