iDreamPost

Shivam Dube: అంపైర్ దుబే జేబులు చెక్ చేయడానికి కారణం? ఫొటోలు వైరల్..

మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ చెన్నై స్టార్ ప్లేయర్ శివం దుబే జేబులు చెక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే దుబే చీటింగ్ చేశాడా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ చెన్నై స్టార్ ప్లేయర్ శివం దుబే జేబులు చెక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే దుబే చీటింగ్ చేశాడా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Shivam Dube: అంపైర్ దుబే జేబులు చెక్ చేయడానికి కారణం? ఫొటోలు వైరల్..

ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ అనుహ్య సంఘటన చోటుచేసుకుంది. బహుశా ఈ సీన్ ను మ్యాచ్ చూసిన వారు గమనించి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఆ సీన్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ చెన్నై స్టార్ ప్లేయర్ శివం దుబే జేబులు చెక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే దుబే చీటింగ్ చేశాడా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శివం దూబే.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్న ఆటగాళ్లలో ముందువరుసలో ఉన్నాడు. అద్భుతమై ఫామ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న దుబే.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ చేసే అవకాశాలను కోల్పోయింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ శివం దుబే జేబులను ఆన్ ఫీల్డ్ అంపైర్ అకస్మాత్తుగా చెక్ చేశాడు. దుబే బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనీల్ చౌదరి అతడి దగ్గరికి వెళ్లి.. జేబులను చెక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు అయోమయానికి గురైయ్యారు.

కాగా.. దుబే జేబుల్లో ఏం లేవని తేల్చుకున్న అంపైర్ ఆ తర్వాత ఆటను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు అంపైర్ సడెన్ గా ఇలా ఎందుకు తనిఖీ చేశాడు? దుబే నిజంగానే చీటింగ్ చేశాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇటు అంపైర్ గానీ, అటు దుబే గానీ స్పందించలేదు. కాగా.. మ్యాచ్ మధ్యలో ఇలా అప్పుడప్పుడు అంపైర్లు ఆటగాళ్లను చెక్ చేయడం సర్వసాధారణమైన విషయమే. ప్లేయర్లు బంతి స్థితిని మార్చేందుకు ఏమైనా అనుమానస్పదమైన వస్తువులు గ్రౌండ్ లోకి తీసుకొచ్చారా? అన్న డౌట్ తో ఇలా చేస్తుంటారు. అదే విధంగా అంపైర్ అనుమతి లేకుండా ఆటగాళ్లు గ్రౌండ్ లోకి ఎలాంటి క్రీమ్స్ గానీ, ఇతర వస్తువులు గానీ తీసుకురాకూడదు. ఇక అంపైర్ తనిఖీలో దుబే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తీసుకురాలేదని తెలుస్తోంది. నెటిజన్లు మాత్రం దుబే కర్చీఫ్ బయటకి వస్తే.. అంపైర్ పాకెట్ లోకి నెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి