iDreamPost

అడ్డంగా దొరికిన షారుఖ్ కొడుకు…? ఫోన్ సీజ్ ఫస్ట్, అరెస్ట్ నెక్స్ట్…?

అడ్డంగా దొరికిన షారుఖ్ కొడుకు…? ఫోన్ సీజ్ ఫస్ట్, అరెస్ట్ నెక్స్ట్…?

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ముంబై విభాగం బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌పై అధికారులు దాడి చేసి శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది . ఆర్యన్ ఖాన్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని, ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే జాతీయ మీడియాకు తెలిపారు.

ఆర్యన్ ఖాన్‌ తో పాటు అతని సన్నిహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్ మరియు గోమిత్ చోప్రాలను కూడా విచారిస్తున్నారు. క్రూయిజ్ పార్టీని ప్లాన్ చేసిన ఆరుగురు నిర్వాహకులను కూడా ఎన్‌సిబి పిలిచింది. ఎఫ్ టీవీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్ కూడా ఈ కేసులో ఉన్నారని తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని కాషిఫ్ ఖాన్ పర్యవేక్షణలో నిర్వహించారు అని అధికార్లు తెలిపారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఫోన్ లో ఉన్న డేటాను తాము పరిశీలిస్తున్నాం అని, అలాగే డ్రగ్స్ కి సంబంధించి అతనికి పరిక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆర్యన్ ఖాన్ షారూఖ్ ఖాన్ అలాగే గౌరీ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు . ఈ జంటకు సుహానా ఖాన్ అనే కుమార్తె మరియు మరొక కుమారుడు అబ్రామ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు అని తెలుస్తుంది. వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు

మీడియాకు అందిన సమాచారం ప్రకారం… ముంబైలోని ఎన్‌సిబి అధికారులు అక్టోబర్ 2 న ముంబై నుండి గోవాకు వెళ్లే కార్డెలియా క్రూయిజ్‌ పై దాడి చేశారు. ఈ దాడి చేసిన సమయంలో అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ షిప్ లో ఎండీఏంఏ, కొకైన్, మెఫెడ్రోన్ మరియు చరాస్ వంటి డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ విభాగం కొంతమంది ప్రయాణీకుల లగేజీలో డ్రగ్స్ ను గుర్తించారు అని అధికారులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, ఫిల్మ్ మరియు టెలివిజన్ ప్రొడక్షన్, స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ డిగ్రీని అందుకున్నాడు ఆర్యన్. అతని ఉన్నత విద్య మొత్తం విదేశాల్లోనే సాగింది.

Also Read : పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ ప్లాన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి