పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ ప్లాన్

By iDream Post Oct. 03, 2021, 02:30 pm IST
పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ ప్లాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్ప పార్ట్ 1 విడుదలను డిసెంబర్ 17కి ఫిక్స్ చేస్తూ నిన్న ప్రకటన విడుదల చేయడం బన్నీ ఫ్యాన్స్ లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచింది. ఒకపక్క పాన్ ఇండియా సినిమాలన్నీ డేట్లను లాక్ చేసుకుంటున్న తరుణంలో ఇంకా ఆలస్యం చేస్తే తేదీలు మిస్ అవుతాయనే ఉద్దేశంతో మైత్రి టీమ్ ముందు క్రిస్మస్ అనుకున్నా తర్వాత మనసు మార్చుకుని ఫైనల్ గా ఒక వారం ముందగానే రావాలని డిసైడ్ అయ్యింది. షూటింగ్ మొత్తం పూర్తి కానప్పటికీ వచ్చే నెల రెండో వారం లోపు ఫినిష్ చేసి ఆలోగా చిత్రీకరించిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయించేస్తున్నారు దర్శకుడు సుకుమార్.

అడవి నేపథ్యంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా విభిన్నమైన పాత్ర చేస్తుండగా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా చాలా క్రూరమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇటీవలే రిలీజైన హీరోయిన్ రష్మిక మందన్న లుక్ కూడా అంచనాలు పెంచేసింది. ఇక దాక్కో దాక్కో మేక లిరికల్ సాంగ్ సృష్టించిన సంచలనాలు తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ రంగస్థలం, ఉప్పెన తర్వాత అంతకు మించిన స్థాయిలో దీనికే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చినట్టు గట్టి టాక్ ఉంది. రెండో భాగం 2022లో వేణు శ్రీరామ్ తో చేయబోయే ఐకాన్ పూర్తయ్యాక కంటిన్యూ చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడు కానీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఇక చేతిలో ఉన్న 75 రోజుల సమయాన్ని పుష్ప టీమ్ పక్కా ప్లానింగ్ తో డిజైన్ చేయబోతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో పాన్ ఇండియా లెవెల్ లో ఒకే హైప్ వచ్చేలా పలు రకాల ప్రోగ్రాంలు, పబ్లిసిటీ డిజైన్లు సిద్ధం చేశారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలకు విడివిడిగా ఒక్కో ఈవెంట్ స్పెషల్ గా చేయబోతున్నారు. గెస్ట్ సెలబ్రిటీలు కూడా ఏ భాషకు తగ్గట్టు ఆ బాషకు వేర్వేరుగా తీసుకొస్తున్నారు. లిరికల్ వీడియోలు, టీజర్, ట్రైలర్ ఏదీ తగ్గకుండా ఓ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత దాన్ని మించిన హిట్ ఇచ్చేలా పుష్ప వేస్తున్న స్కెచ్ ఓ రేంజ్ లో ఉండబోతోంది

Also Read : ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి మంచి టైం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp