iDreamPost
android-app
ios-app

షారూఖ్ ఖాన్ కొడుకుకి క్లీన్ చిట్ ఇచ్చిన పోలీస్ అధికారి సంచలన నిర్ణయం!

  • Published Apr 19, 2024 | 10:37 PM Updated Updated Apr 19, 2024 | 10:37 PM

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గతంలో ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ అప్పటిలో ప్రత్యేక నేతృత్వం వహించారు. కాగా, తాజాగా సంజయ్ సింగ్ తన వృత్తిలో ఓ కీలక నిర్ణయం తీసుకోవడం పై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గతంలో ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ అప్పటిలో ప్రత్యేక నేతృత్వం వహించారు. కాగా, తాజాగా సంజయ్ సింగ్ తన వృత్తిలో ఓ కీలక నిర్ణయం తీసుకోవడం పై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

  • Published Apr 19, 2024 | 10:37 PMUpdated Apr 19, 2024 | 10:37 PM
షారూఖ్ ఖాన్ కొడుకుకి క్లీన్ చిట్ ఇచ్చిన పోలీస్ అధికారి సంచలన నిర్ణయం!

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గతంలో ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఆర్యన్ నిందుతుడిగా భావించి అతని పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ ఛార్జిషీట్ ను కోర్టులో ప్రవేశపెట్టింది. ఇక ఈ కేసులో చిక్కుకున్న ఆర్యన్ దాదాపు 26 రోజుల పాటు ఎన్సీబీ కస్టడీలో ఉన్నాడు. కానీ, ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 20 మందిలో 14 మంది నిందితులు పేర్లు ఉన్నాయని అప్పటిలో ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ తెలిపారు. అలాగే ఆ జాబితాలో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆర్యన్ ఖన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన సంజయ్ సింగ్ తాజాగా స్వచ్ఛందగా పదవీ విరమణ తీసుకోవడంపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న సంజయ్ సింగ్ 2021 నుంచి ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. కాగా, ఒడిశా కేడర్ కు చెందిన సంజయ్ సింగ్ 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. ఆ తర్వాత 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. అలాగే దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో భాగమై పూర్తిచేసిన ట్రాక్‌ రికార్డ్‌ సంజయ్ సింగ్ కు ఉంది. అలాంటి వ్యక్తి తాజాగా స్వచ్ఛందగా పదవి విరమణ చేయడం పై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. ‘ ఈ ఏడాది ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఇక ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే నేను గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన పేర్కొన్నారు.

Aryan khan

కాగా, రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్‌సీబీ బృందం దాడి చేసింది. ఇక ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేశారు. అయితే అతను డ్రగ్స్‌ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్‌లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్‌సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో ఆర్యన్ తో పాటు షారుఖ్ ఖాన్ కు కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు.అయితే అదే సమయంలో ఆర్యన్‌ ఎలాంటి తప్పు చేయలేదని, గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే.. ఆర్యన్‌ ఉదంతాన్ని తెరపైకి తీసుకువచ్చారని వాదనలు వినిపించాయి.

కానీ, ముంబై జోన్‌లో అప్పటి ఎన్‌సీబీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. ఇక కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి సమీర్ వాంఖడేను ఈ కేసు నుంచి తప్పించారు. కాగా, ఆయన స్థానంలో ఆ తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. ఇక 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్‌ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. ఈ క్రమంలోనే  2022 మేలో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్‌ చిట్‌ దక్కింది. మరి, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక నేతృత్వం వహించిన సంజయ్ సింగ్ సడెన్ గా స్వచ్ఛంద పదవి విరమణ చేయడం పై మీ అభిప్రాయాలరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis