iDreamPost
android-app
ios-app

ధోనీ vs ABD ఎవరు బెస్ట్ ఫినిషర్? సమాధానం దొరికేసింది..!

  • Author Soma Sekhar Published - 03:34 PM, Sat - 16 September 23
  • Author Soma Sekhar Published - 03:34 PM, Sat - 16 September 23
ధోనీ vs ABD ఎవరు బెస్ట్ ఫినిషర్? సమాధానం దొరికేసింది..!

సాధారణంగా ఏ రంగంలోనైనా పోలిక అనేది సహజం. అది వ్యక్తికి, వ్యక్తికి మధ్య కావొచ్చు.. లేదా సంస్థకు సంస్థకు మధ్య కావొచ్చు.. మరింకేదైనా విషయంలోనైనా కావొచ్చు. ఏ రంగంలోనైనా పోలికలు ఉండనే ఉంటాయి. అలానే క్రికెట్ లో కూడా బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య పోలికలు చెబుతూ ఉంటారు క్రీడా దిగ్గజాలు. పలానా బ్యాటర్.. ఆ స్టార్ బ్యాటరంత అవుతాడని, పలానా బౌలర్ దిగ్గజ బౌలర్ ను మరిపిస్తాడని క్రీడా విశ్లేషకులు చెప్పడం మనం వినే ఉన్నాం. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్, మాజీ ఆటగాడు అయిన డివిలియర్స్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే? మహేంద్ర సింగ్ ధోనీ, ఏబీ డివిలియర్స్ లలో ఎవరు బెస్ట్ ఫినిషర్? ఈ ప్రశ్నకు డివిలియర్స్ ఏ సమాధానం ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఫినిషర్లు ఉన్నారు. కానీ వారందరూ బెస్ట్ ఫినిషర్లు కారు. జట్టు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేనున్నాంటూ.. ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టి, టీమ్ కు అనుకోని విజయాన్ని అందించేవాడే అసలైన ఫినిషర్. వరల్డ్ క్రికెట్ లో ధోనీ, డివిలియర్స్, దినేష్ కార్తీక్ లతో పాటుగా ఎందరో ఫినిషర్లు ఉన్నారు. ఇటీవలే ఐపీఎల్ ద్వారా రింకూ సింగ్ రూపంలో టీమిండియాకు మరో ఫినిషర్ దొరికాడనే చెప్పాలి. ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే.. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్, మాజీ ఆటగాడు అయిన ఏబీ డివిలియర్స్ కు ఎక్కడకు వెళ్లిన ఓ ప్రశ్న ఎదురవుతోందట. అదేంటంటే? మహేంద్ర సింగ్ ధోనీ, డివిలియర్స్ లో ఎవరు బెస్ట్ ఫినిషర్ అని.

అయితే ఈ ప్రశ్నకు ఒక్క క్షణం అలోచించకుండా సమాధానం చెప్పాడు డివిలియర్స్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు ఈ చిచ్చర పిడుగు. డివిలియర్స్ మాట్లాడుతూ..”నేను ఏ డిబేట్ లో పాల్గొన్నా.. నాకు ఎదురయే ప్రశ్న ఇది. మా ఇద్దరిలో బెస్ట్ ఫినిషర్ ఎవరు? అనేది. నేను దీనికి ఎలాంటి ఆలోచన లేకుండా సమాధానం ఇస్తాను ధోనీ అని. నా దృష్టిలో ధోనీనే నా కన్నా బెస్ట్ ఫినిషర్” అంటూ సమాధానం ఇచ్చాడు మిస్టర్ 360 బ్యాటర్. ఇక ఏబీడీ ఇచ్చిన ఆన్సన్ తో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. డివిలియర్స్ లాంటి దిగ్గజ బ్యాటరే ధోనీ ఫినిషింగ్ కు ఫిదా అయ్యాడు అంటూ సోషల్ మీడియా వేదికాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio