iDreamPost

Pathaan box office collection day 3300 స్పీడులో పఠాన్ ఎక్స్ ప్రెస్

Pathaan box office collection day 3300 స్పీడులో పఠాన్ ఎక్స్ ప్రెస్

షారుఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీ పఠాన్ సృష్టిస్తున్న విధ్వంసం మాములుగా లేదు. రోజుకి కనీసం వంద కోట్ల వసూళ్లు లేనిదే బాద్షా సెలవు తీసుకోవడం లేదు. ఇప్పటిదిదాక మూడు రోజులకు గాను అక్షరాలా 313 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పఠాన్ ఈ జోరుని ఆదివారం దాకా కొనసాగించనున్నాడు. వీకెండ్ ఫిగర్లు మరింత భారీగా ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీలో భారీ స్పందన ఉండగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో పాటు ఇతర బాషలకు సంబంధించి ఒరిజినల్ అంత దూకుడు లేదని రిపోర్ట్స్ ఉన్నాయి.

ఈ స్పందన పట్ల షారుఖ్ ఆనందం మాములుగా లేదు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మొహం చూసి పదేళ్లు కావడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ముఖ్యంగా నార్త్ సైడ్ థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయని ముంబై టాక్. పివిఆర్ ప్రత్యేకంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు షోలు వేసినా ఫుల్ అవుతున్నాయి. గుర్గావ్, ఢిల్లీ, ముంబై, కోల్కతా దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో మల్టీ ప్లెక్సులో యావరేజ్ గా ముప్పై నుంచి యాభై షోల దాకా పడుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు,

ఫైనల్ రన్ అయ్యేలోపు కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ దాటేస్తుందనే ఆశతో బాలీవుడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి కానీ అదంత సులభంగా నెరవేరేలా లేదు. ఎందుకంటే అలా జరగాలంటే పఠాన్ ఇదే భీభత్సాన్ని కనీసం రెండు వారాలకు పైగానే కొనసాగించాల్సి ఉంటుంది. కానీ సోమవారం నుంచి డ్రాప్ అయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అర్బన్ సిటీస్ లో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ భారీ యాక్షన్ తప్ప కథ ఎమోషన్లు పెద్దగా లేని పఠాన్ ని బిసి సెంటర్స్ ఆ స్థాయిలో కంటిన్యూగా ఆదరించడం మీద అనుమానాలున్నాయి. ఏది ఏమైనా బాలీవుడ్ కి పఠాన్ రూపంలో పెద్ద ఆక్సిజన్ దొరికిన మాట వాస్తవం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి