iDreamPost
android-app
ios-app

OTT Movie: OTT లోకి వచ్చేసిన రాశికన్నా యాక్ష‌న్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Apr 26, 2024 | 10:59 AM Updated Updated Apr 26, 2024 | 2:12 PM

ఓటీటీ లోకి ఈ వారం కొత్తగా వచ్చే సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా సైలెంట్ గా వచ్చేసి సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాశికన్నా నటించిన ఓ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

ఓటీటీ లోకి ఈ వారం కొత్తగా వచ్చే సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా సైలెంట్ గా వచ్చేసి సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాశికన్నా నటించిన ఓ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

  • Published Apr 26, 2024 | 10:59 AMUpdated Apr 26, 2024 | 2:12 PM
OTT Movie: OTT లోకి వచ్చేసిన రాశికన్నా యాక్ష‌న్  మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఓటీటీ లో కొన్ని సినిమాలు విపరీతమైన బజ్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినప్పటినుంచే.. వరుసగా దానికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దీనితో ప్రేక్షకులు కూడా ఆయా సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు ఆశించిన విధంగానే ఆయా సినిమాలు ఓటీటీ లో కూడా మంచి వ్యూవర్ షిప్ నే దక్కించుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి. అవి కూడా మంచి టాక్ నే సంపాదించుకుంటాయి. ఇక ఇప్పుడు తాజా రాశి ఖన్నా నటించిన ఓ హాలీవుడ్ మూవీ ఒకటి ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ చూడాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

రాశి ఖన్నా నటించిన ఈ బాలీవుడ్ సినిమా పేరు “యోధ”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నలభై రోజుల తర్వాత ఓటీటీ లో రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు పదకొండేళ్ల తర్వాత బాలీవుడ్ స్క్రీన్ పైన దర్శనం ఇచ్చింది రాశి ఖన్నా.. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన సినిమా యోధ. ఈ సినిమాలో సిద్ధార్ద్ మల్హోత్రా హీరోగా నటించాడు. ఇక రాశిఖన్నాతో పాటు ఈ సినిమాలో దిశాపటాని కూడా మరొక హీరోయిన్ గా నటించింది. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేకపోవడంతో.. థియేటర్స్ లో మిక్సెడ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా .. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 26 శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది/.

ఇక యోధ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా దేశంలో టెర్రరిస్టులు చేసే కుట్రలను అడ్డుకునేందుకు.. ప్రభుత్వం యోధ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తుంది. ఇందులో ఒక సైనికుడిగా పని చేస్తుంటాడు సిద్ధార్ద్ . ఈ క్రమంలో టెర్ర‌రిస్ట్‌లు ఓ ఫ్లైట్‌ను హైజాక్ చేస్తారు. దీనితో అందులో ప్రయాణికులంతా బందీలుగా మారుతారు. ఈ హైజాక్ నుంచి ప్రయాణికులను సిద్ధార్ద్ వారిని ఎలా కాపాడాడు! రాశి ఖన్నా పాత్ర ఏమిటి ! ఈ పోరాటంలో దిశా పటాని ఎలా సహాయపడింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఓటీటీ లో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş