iDreamPost

15రోజుల్లోనే OTTలో ఐశ్వ‌ర్య రాజేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

  • Published Apr 26, 2024 | 11:47 AMUpdated Apr 26, 2024 | 11:47 AM

ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఫ్యామలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం డియర్. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలయి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింద. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఫ్యామలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం డియర్. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలయి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింద. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 26, 2024 | 11:47 AMUpdated Apr 26, 2024 | 11:47 AM
15రోజుల్లోనే OTTలో ఐశ్వ‌ర్య రాజేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఫ్యామలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘డియర్’. ఈ సినిమాను దర్శకుడు రవిచంద్రను తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో ఏప్రిల్ 11 విడుదల చేయగా.. ఒక రోజు గ్యాప్ లోనే తెలుగులో ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదల చేశారు.అయితే ఈ మూవీని ఆంధ్ర రైట్స్ ను అన్నపూర్ణ స్టూడియోస్ , తెంగాణ రైట్స్ ను ఏషియన్ సినిమాస్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన డియర్ మూవీ కామెడీ పరంగా ప్రేక్షకులను అలరించిన, కాన్సెప్ట్ పరంగా సరికొత్తగా అడియోన్స్ చూపించే ప్రయత్నంలో విఫలమైందనే చెప్పాలి. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమైయింది. ఇంతకి ఎప్పుడంటే..

ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ కుమార్ ఇటీవలే ‘డియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను ఈనెల అనగా ఏప్రిల్ 11న తమిళ్ లో, ఏప్రిల్ 12న తెలుగు వెర్షన్ విడుదల చేశారు. ఇక గుర‌క స‌మ‌స్య నేపథ్యంతో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌విచంద్ర‌న్ డియ‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. కానీ, కాన్సెప్ట్ ను మాత్రం ఎంచుకొని ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు అనే చెప్పవచ్చు. ఈ క్రమంలో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే థియేటర్ లో ఫ్లాప్ అయిన ఈ సినిమా విడుదల అయిన రెండు వారాలకే ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. మరో వైపు తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా అసలు రిలీజైన విషయం తెలియకుండానే ఎత్తేశారు. ఈ నేపథ్యంలోనే డియర్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ హక్కులకు కొనుగోలు చేసుకుంది. ఇక డియార్ సినిమా ఈనెల అనగా ఏప్రిల్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే.. డియర్ సినిమా థియేటర్లలో రిజల్ట్ కారణంగానే రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

ఇక డియర్ సినిమా విషయానికొస్తే.. హీరో అర్జున్ (జీవీ ప్ర‌కాష్ కుమార్‌) ఓ న్యూస్ రీడ‌ర్‌. చిన్న‌పాటి శ‌బ్దాల‌కే నిద్ర‌లో నుంచి మేల్కొంటుంటాడు. ఇక హీరోయిన్ దీపికతో (ఐశ్వ‌ర్య రాజేష్‌) అత‌డి పెళ్లిని పెద్ద‌లు జ‌రిపిస్తారు. అయితే దీపిక‌కు గుర‌క‌పెట్టే అల‌వాటు ఉంటుంది. ఇలా ఒక‌రి స‌మ‌స్య‌ను మ‌రికొరు దాచేసి పెళ్లిచేసుకుంటారు. అలా  భార్య గుర‌క కార‌ణంగా అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? ఈ చిన్న స‌మ‌స్య‌కు దీపిక నుంచి విడాకులు తీసుకోవాల‌ని అనుకున్న అర్జున్ ప్ర‌య‌త్నాలు నెర‌వేరాయా? దీపిక సంఘ‌ర్ష‌ణ‌ను ఎలా అర్థం చేసుకున్నాడు? అన్న‌దే డియర్ మూవీ క‌థ‌. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే డియర్ మూవీ చూసేయాల్సిందే. మరి, థియేటర్లలో విడుదలయిన రెండు వారలకే డియర్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి