iDreamPost

వామ్మో.. షారూఖ్ ఖాన్ ధరించిన లగ్జరీ వాచ్ అన్ని కోట్లా?

Shah Rukh Khan Watch: సినీ సెలబ్రెటీలు ధరించే కాస్ట్యూమ్స్, వాచ్, షూస్.. వాళ్లు వాడే బైక్స్, కార్లు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. సెలబ్రెటీలు ప్రపంచంలోనే మోస్ట్ స్టైలిష్ బ్రాండ్స్ ఉపయోగిస్తుంటారు.

Shah Rukh Khan Watch: సినీ సెలబ్రెటీలు ధరించే కాస్ట్యూమ్స్, వాచ్, షూస్.. వాళ్లు వాడే బైక్స్, కార్లు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. సెలబ్రెటీలు ప్రపంచంలోనే మోస్ట్ స్టైలిష్ బ్రాండ్స్ ఉపయోగిస్తుంటారు.

వామ్మో.. షారూఖ్ ఖాన్ ధరించిన లగ్జరీ వాచ్ అన్ని కోట్లా?

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా టీవీ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై తనదైన మార్క్ చాటుకున్నాడు. షారూఖ్ నటుడిగానే కాకుండా పలు ఈవెంట్స్, బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఇక వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన పఠాన్, జవాన్ రెండు చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అంటే ఆయనకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థమవుతుంది. 2023 షారూఖ్ కి కలిసి వచ్చిన సంవత్సరం అంటారు అభిమానులు. తాజాగా ఆయన ధరించిన వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

షారూఖ్ ఖాన్ కి మొదటి నుంచి వాచ్ కలెక్షన్లు అంటే చాలా ఇష్టమని అంటారు. ఆయన వద్ద ఎన్నో ఖరీదైన వాచ్ లు ఉన్నట్లు సమాచారం. షారూఖ్ ఖాన్ వరల్డ్ టాప్ రిచెస్ట్ యాక్టర్స్ లో 4వ స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. షారూఖ్ ఖాన్ కి సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్ రంగంలో తనదైన టాలెంట్ తో దూసుకువెళ్తున్నారు. ఐపీఎల్ కోల్‌కొతా నైట్ రైడర్స్ యజమాని. ఆయన ఏ చిన్న యాడ్ లో నటించిన కోట్లలో రెమ్యూనరేషన్ ఉంటుంది. షారూఖ్ మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖరీదైన వస్తువులు వాడుతారు.. లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. బాలీవుడ్ ఆయన సంపాదనపై ఎప్పుడూ చర్చలు నడుస్తూనే ఉంటాయి.

షారూఖ్ ఖాన్ ధరించిన వాచ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుపుతున్నారు. ఆయన ధరించిన నీలి రంగు ఆడెమర్స్ పిగెట్ ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు రూ.5 కోట్లు. ఈ వాచ్ డెలిరీ కోసం రూ. 8 వేలు చెల్లించాడంటే దీని ప్రాముఖ్యత ఎంతో అర్థం చేసుకోవొచ్చు. ఆడెమర్స్ వెబ్ సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి- నైట్ పీస్. ఇవి చాలా లిమిటెడ్ వెర్షన్ అంటారు. ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. సమయం, నెలలు, రోజులు తదితర వివరాలు ఉంటాయి. దుబాయ్ లో జరిగిన ఇంటర్నేషనల్ టీ 20 సందర్భంగా షారూఖ్ ఖాన్ ఈ వాచ్ ధరించి కనిపించాడు. ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు ఈ వాచ్ ధరపై వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి