iDreamPost

VIDEO: షారుక్ పాటకు బెడ్​పై నుంచి లేచి డ్యాన్స్ చేసిన పేషెంట్!

  • Author singhj Published - 02:07 PM, Fri - 15 September 23
  • Author singhj Published - 02:07 PM, Fri - 15 September 23
VIDEO: షారుక్ పాటకు బెడ్​పై నుంచి లేచి డ్యాన్స్ చేసిన పేషెంట్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ అదిరిపోయే రీతిలో కమ్​బ్యాక్ ఇచ్చారు. వరుసగా ఫ్లాపులు రావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న స్టార్ హీరో.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఈ ఏడాది మొదట్లో ‘పఠాన్’తో రూ.1,000 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్.. ఏడు నెలల గ్యాప్​లో ‘జవాన్​’తో మరో భారీ హిట్ కొట్టారు. ఒకే ఏడాదిలో రెండు సూపర్ హిట్స్​తో బాలీవుడ్​లో తానే నంబర్ వన్ అని ఆయన నిరూపించుకున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ‘జవాన్’ నార్త్​తో పాటు సౌత్​లోనూ వసూళ్లలో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా తమిళనాడులో కింగ్ ఖాన్ మూవీకి కలెక్షన్స్​ ఒక రేంజ్​లో వస్తున్నాయి.

‘జవాన్’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫుల్​రన్​లో ‘పఠాన్’ కలెక్షన్స్​ను ఈ సినిమా అధిగమిస్తుందో లేదో చూడాలి. ‘జవాన్’ సక్సెస్​లో అట్లీ డైరెక్షన్, షారుక్ ఫెంటాస్టిక్ యాక్టింగ్​తో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్​కు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ‘జవాన్’లో అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు అనిరుధ్. అలాగే ‘చలేయా’ రూపంలో ఓ చార్ట్ బస్టర్​ సాంగ్​ను కూడా కంపోజ్ చేశాడు. సినిమాలో ఈ పాటకు షారుక్ ఖాన్, నయనతార కూల్ స్టెప్స్ వేస్తూ ఆడియెన్స్​ను అలరించారు. మూవీ రిలీజ్ తర్వాత ఈ పాట మరింత హిట్టయింది. ‘చలేయా’ సాంగ్​లో డ్యాన్స్ కంపోజిషన్​కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

‘చలేయా’ పాటకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షారుక్ లేడీ ఫ్యాన్ ఒకరు కూడా ‘చలేయా’ పాటకు కాళ్లు కదిపారు. రీసెంట్​గా కోలుకున్న ఆమె బెడ్ మీద నుంచి లేచి మరీ పాటకు స్టెప్పులేశారు. సోషల్ మీడియాలో వైరల్​గా మారిన ఈ వీడియోను చూసిన షారుక్ కూడా ఆమె డ్యాన్స్​కు ఫిదా అయ్యారు. ఇది చాలా బాగుందని.. మీరు త్వరగా కోలుకొని ‘జవాన్’ మూవీ చూడండని ఆ అభిమానిని ఉద్దేశించి షారుక్ ఓ ట్వీట్ చేశాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక మరో డ్యాన్స్ వీడియో చేయాలని.. దాని కోసం ఎదురు చూస్తానని ఆ ట్వీట్​లో ఆయన రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ మూవీ రివ్యూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి