iDreamPost

Video: పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌లో ఇంత మార్పా? నమ్మశక్యం కానీ క్యాచ్‌ అందుకున్న ఫీల్డర్‌!

  • Author Soma Sekhar Published - 12:27 PM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 12:27 PM, Wed - 23 August 23
Video: పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌లో ఇంత మార్పా? నమ్మశక్యం కానీ క్యాచ్‌ అందుకున్న ఫీల్డర్‌!

గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పాక్ క్రికెట్ బోర్డులో మార్పులతో పాటు పాక్ టీమ్ ఆట కూడా పూర్తిగా మారిపోయింది. అందుకు గత టోర్నీల్లో పాక్ ఆడినతీరే ఉదాహరణ. ఇక పాక్ ఫీల్డింగ్ లో సైతం నమ్మశక్యం కాని మార్పులు సంభవించాయి అంటే మీరు నమ్ముతారా? అయితే ఆఫ్ఘాన్ తో జరిగిన తొలి వన్డేలో పాక్ ఫీల్డర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మీరు చూసి తీరాల్సిందే. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘాన్ ను 19.2 ఓవర్లలో కేవలం 59 పరుగులకే కుప్పకూల్చింది పాకిస్థాన్. దీంతో 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది దాయాది దేశం. ఇక ఈ మ్యాచ్ లో షాదాబ్ ఖాన్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

శ్రీలంక వేదికగా పాకిస్థాన్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. తాజాగా జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ 142 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘాన్ ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టును వణికించారు ఆఫ్ఘాన్ బౌలర్లు. దీంతో 47.1 ఓవర్లలోనే 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది పాకిస్థాన్. జట్టులో ఇమామ్ ఉల్ హక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తీకర్ అహ్మద్ (30) పరుగులతో రాణించారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 3 వికెట్లు తీయగా.. నబి, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు తీసి రాణించారు.

అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ పాక్ బౌలర్ల ధాటికి కేవలం 59 పరుగులకే కుప్పకూలీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. జట్టులో ఇద్దరంటే ఇద్దరే బ్యాటర్లు రెండంకెల స్కోర్ చేశారు. పాక్ బౌలర్లలో హారీశ్ రౌఫ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. నమ్మశక్యంకానీ రీతిలో పాక్ ఫీల్డర్ షాదాబ్ ఖాన్ అందుకున్న క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ లో ఈ క్యాచ్ నమోదు అయ్యింది.

నసీం షా వేసిన ఈ ఓవర్ లో ఆఫ్ఘాన్ కెప్టెన్ హస్మతుల్లా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే షా విసిరిన షార్ట్ పిచ్ బాల్ ను భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ గాల్లోకి ఎగురుతూ.. బాల్ ను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ తొలి ప్రయత్నంలో విఫలం కాగా.. మళ్లీ బాల్ ను కిందపడుతూ అందుకున్న తీరు అమోఘమనే చెప్పాలి. జాంటీ రోడ్స్ ను తలపించేలా షాదబ్ క్యాచ్ అందుకున్న తీరుపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి షాదాబ్ అందుకున్న ఈ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: BREAKING: లెజెండరీ క్రికెటర్‌ హీత్‌ స్ట్రీక్‌ చనిపోలేదు.. బతికే ఉన్నాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి