iDreamPost

సెక్స్ వర్కర్లను వేధించరాదు : పోలీసులకు సుప్రీం ఆదేశాలు

హోటళ్లు, దాబాలు, లాడ్జిలు వంటి వాటిపై దాడులు నిర్వహించిన సమయంలో సెక్స్ వర్కర్లు పట్టుబడినా వారి ఫొటోలను మీడియాకు ఇవ్వరాదని స్పష్టం చేసింది. అలాగే వారిపై మాటల దాడి లేదా భౌతికంగా దాడులు చేయరాదని తెలిపింది. సమాజంలో సామాన్యులను గౌరవించినట్లే.. సెక్స్ వర్కర్లకు కూడా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంటూ..

సెక్స్ వర్కర్లను ఏ రకంగానూ వేధించరాదని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులను ఆదేశించింది. హోటళ్లు, దాబాలు, లాడ్జిలు వంటి వాటిపై దాడులు నిర్వహించిన సమయంలో సెక్స్ వర్కర్లు పట్టుబడినా వారి ఫొటోలను మీడియాకు ఇవ్వరాదని స్పష్టం చేసింది. అలాగే వారిపై మాటల దాడి లేదా భౌతికంగా దాడులు చేయరాదని తెలిపింది. సమాజంలో సామాన్యులను గౌరవించినట్లే.. సెక్స్ వర్కర్లకు కూడా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంటూ.. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని.. సెక్స్ వర్కర్ల ఫొటోలను ప్రచురించినా, వారి గుర్తింపును వెల్లడించినా ప్రచురించిన వారిపై ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపింది. సెక్స్ వర్కర్ల ఫొటోలు, వివరాలను ప్రచురించే విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్టికల్ 142ని అనుసరించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.

స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని, వ్యభిచార గృహాల్లో స్వచ్ఛందంగా ఉంటున్న సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయడం, శిక్షించడం వంటివి చేయకూడదని సిఫార్సుల్లో పేర్కొంది. సెక్స్ వర్కర్ లైంగిక దాడికి గురైతే.. సెక్షన్ 357సీ ప్రకారం తక్షణమే వైద్య సేవలు అందించాలి. సెక్స్ వర్కర్లకు కూడా సాధారణ పౌరుల మాదిరి అన్ని హక్కులూ ఉంటాయని, వారిని చులకనగా చూడరాదని సుప్రీం తెలిపింది. అలాగే యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ను అనుసరించి సెక్స్ వర్కర్లందరికీ ఆధార్ కార్డు జారీ చేయాలని, వారిని ఎక్కడా సెక్స్ వర్కర్ గా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి