iDreamPost

కేక్ తిని బాలిక మృతి.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి

పుట్టిన రోజు వేడుకల్లో కేకు తిని బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. అయితే ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పుట్టిన రోజు వేడుకల్లో కేకు తిని బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. అయితే ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేక్ తిని బాలిక మృతి.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి

పుట్టిన రోజు వేడుకలు అనగానే ముందుగా గర్తోచ్చేది కేక్. బర్త్ డేలు ఒక్కటే కాదు పెళ్లిల్లకు.. ఇతర శుభకార్యాలకు సెలబ్రేట్ చేసుకునేందుకు కేక్ ఉండాల్సిందే. వినియోగదారులకు రకరకాల కేకులు అందుబాటులోకి వచ్చాయి. కేక్ తయారీ కంపెనీలు టేస్టీ కేకులను తయారు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అయితే ఇటీవల కేకుల్లో నాణ్యత లోపించి అనారోగ్యాలకు గురైన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదే విధంగా ఓ రాష్ట్రంలో ఓ బాలిక పుట్టిన రోజునాడు కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గత నెలలో పంజాబ్ లో చోటుచేసుకుంది.

పంజాబ్ లో మాన్వి అనే బాలిక బర్త్ డే సందర్భంగా ఓ బేకరీ నుంచి ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్‌ ఆర్డర్ చేశారు. కేక్ తిన్న వెంటనే కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వాంతులు అయ్యాయి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం క్షీణించింది. పొరుగువారు వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈఘటనలో 10 ఏళ్ల బాలిక మాన్వి మరణించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బేకరీ షాపు యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేకు తిన్న వెంటనే అనారోగ్యానికి గురికావడంపై దృష్టి పెట్టిన అధికారులు కేక్ ఫుడ్ పాయిజన్ అయ్యిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఇప్పుడు దర్యాప్తులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి. సంచలన విషయాలు వెల్లడించారు అధికారులు. కేక్ లో ఆర్టీఫీషియల్ స్వీట్ నర్ సాచరైన్ ను అధిక మోతాదులో వాడినట్లు అధికారులు నిర్థారించారు. సాధారణంగా ఆహారం, పానియాలలో దీనిని తక్కువ మొత్తంలో వాడుతారని తెలిపారు. కేక్ లో మోతాదుకు మించి ఎక్కువగా వాడటంతో దాన్ని తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కేక్ తయారీ చేసిన బేకరీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి