iDreamPost

సీనియర్ నటి కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. హీరోయిన్ రేంజ్ లో!

  • Published Mar 26, 2024 | 8:38 PMUpdated Mar 26, 2024 | 8:38 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో .. తల్లి బాటలోనే హీరోయిన్ గా ఎంట్రీ.. ఇండస్ట్రీకి ప్రముఖ సీనియర్ నటి వారసురాలి ఎంట్రీ అంటూ.. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరై ఉంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో .. తల్లి బాటలోనే హీరోయిన్ గా ఎంట్రీ.. ఇండస్ట్రీకి ప్రముఖ సీనియర్ నటి వారసురాలి ఎంట్రీ అంటూ.. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరై ఉంటారు.

  • Published Mar 26, 2024 | 8:38 PMUpdated Mar 26, 2024 | 8:38 PM
సీనియర్ నటి కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. హీరోయిన్ రేంజ్ లో!

సాధారణంగా అన్ని సినిమాలలో హీరో హీరోయిన్లతో పాటు.. ఆయా సినిమాలలో తల్లి పాత్రలలో ప్రధాన పాత్రలలో పోషించి ప్రేక్షకుల మదిలో.. చెరగని పేరును సంపాదించుకున్న ఆర్టిస్ట్ లు ఎంతో మంది ఉంటారు. అలానే, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు నటి నటులు ఎంత పాపులర్ అయినా కూడా.. వారి వారసుల జాడ మాత్రం ఎక్కడా కనిపించదు. వారు పబ్లిక్ లో కనిపించకుండా జాగ్రత్త పడతారో లేదా సమయం వచ్చినపుడు అందరికి కనిపిద్దాం అనుకుంటారో.. తెలియదు కానీ.. అప్పటివరకు కనిపించని వారు.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఇంతకీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించంటే..ఊర్వశి కూతురి గురించి.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో.. మొత్తంగా 700కు పైగా చిత్రాలలో.. అమ్మ పాత్రలలో, అమాయకపు క్యారెక్టర్స్ లో, కామెడీ మాటలతో అందరిని అలరించిన నటి.. ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. ఇప్పటికే ఈమె ఎవరో అందరికి గుర్తొచ్చి ఉంటుంది. ప్రస్తుతం ఊర్వశి సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఊర్వశి కనిపించలేదు. అయితే, ఊర్వశి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ.. ఇప్పటివరకు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయాన్నీ కూడా.. ఇంతవరకు ఎక్కడా పంచుకోలేదు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ సీనియర్ నటి వారసురాలు అంటూ.. తల్లి బాటలో హీరోయిన్ గా ఎంట్రీ అంటూ.. “తేజ లక్ష్మి” అనే అమ్మడు ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

అయితే, సోషల్ మీడియాలో ఆరా తీయగా తెలిసిందేంటంటే.. ఆ తేజ లక్ష్మి మరెవరో కాదు.. నటి ఊర్వశి ముద్దుల కూతురు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. “ఇన్ని సంవత్సరాలుగా.. నా కూతురిని సినిమాలలో నటించేలా చేయలేదు. కారణం ఏంటంటే.. స్టార్స్ వారసులు సినిమాలలో నటించేందుకు వస్తే.. అది వారి పేరెంట్స్ ప్రభావం అని అంటుంటారు. అందుకే నేను నా కూతురిని చదువు పూర్తి చేసి రమ్మని వీటికి దూరంగా పంపాను. అయితే, ఇప్పుడు తన చదువు పూర్తయింది. ఆమె ఇప్పుడు సినిమాలలో ఆసక్తి చూపిస్తోంది.” అంటూ చెప్పుకొచ్చింది ఊర్వశి. ప్రస్తుతం ఈ తల్లి కూతుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి, తేజ లక్ష్మి .. ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఏ మేరకు సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by तेजा🪬 (@mkt_999)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి