iDreamPost

హీరోయిన్‌పై డైరెక్టర్‌ లైంగిక వేధింపులు.. నిలిచిన స్టార్‌ హీరో సినిమా!

తమిళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, ఓ ‍ప్రముఖ హీరోయిన్‌పై ఓ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట...

తమిళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, ఓ ‍ప్రముఖ హీరోయిన్‌పై ఓ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట...

హీరోయిన్‌పై డైరెక్టర్‌ లైంగిక వేధింపులు.. నిలిచిన స్టార్‌ హీరో సినిమా!

తమిళ చిత్ర పరిశ్రమను వరుస వివాదాలు కుదిపేస్తున్నాయి. నిన్నటి వరకు త్రిషపై ప్రముఖ తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు పోలీస్‌ కేసు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన వేడిలో ఉండగానే.. నటి విచిత్ర బిగ్‌బాస్‌ హౌస్‌లో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వివాదానికి తెరతీశాయి. ఈ నేపథ్యంలోనే స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ పేరు కూడా ఈ వివాదంలో తెరపైకి వచ్చింది. 2001లో నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ్‌కాంత్‌.. విచిత్ర ఫిర్యాదును పట్టించుకోలేదన్న వార్తలు మొదలయ్యాయి.

ఇలా వరుస వివాదాలతో కుదేలవుతున్న తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. ఓ ప్రముఖ దర్శకుడు చిత్ర హీరోయిన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న వార్తలు వస్తున్నాయి. ఆయన ఇంకెవరో కాదు.. శీను రామస్వామి. శీను మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతితో ‘ఉదామ విధ ఏవల్‌’ అనే సినిమా చేశారు. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతికి జంటగా మనీషా యాదవ్‌ నటించారు. అయితే, చిత్ర షూటింగ్‌ సందర్భంగా శీను రామస్వామి హీరోయిన్‌ మనీషాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని జర్నలిస్ట్‌ బీస్మీ భకీర్‌ ఆరోపించారు.

ఇప్పుడు ఈ వివాదం మరో లెవల్‌కు వెళ్లింది. శీను రామస్వామి వేధింపులపై మనీషా తాజాగా స్పందించారు. శీను రామస్వామి వీడియోకు ఆమె కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ నేను మౌనంగా ఉన్నానంటే దానర్థం.. మీరు నాపై చేసిన వ్యాఖ్యలన్నీ నిజం అని కాదు.. నేను దీనిపై క్లారిటీ ఇస్తున్నాను. నేను ఎలాంటి శీను రామస్వామి సినిమాలో పని చేస్తున్నాను. నేను మొదటిసారి వింటున్నాను. నేను అతడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను అందరిలాగే అతడికి కూడా చెప్పాను. అది దేన్నీ మార్చదు. నేను 9 ఏళ్ల క్రితం చెప్పిన దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నేను నాతో తప్పుగా ఉన్న వారితో ఎందుకు మళ్లీ కలిసి పని చేస్తాను. సార్‌.. ఇప్పుటికైనా నిజాలు మాట్లాడండి’’ అని పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, కొద్దిరోజుల క్రితం నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. లియోలో త్రిషను రేప్‌ చేసే సీన్‌ ఉంటే బాగుండేదని అన్నారు. తనుకు 109 సినిమాల్లో రేప్‌ చేసిన అనుభవం ఉందన్నారు. గతంలో రోజా, ఖుష్భూలను బెడ్‌పై పడేసినట్లే త్రిషను కూడా పడేసే వాడ్నని అంటూ అసభ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపటంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. మరి, తమిళ చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న వరుస వివాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి