iDreamPost

Seenu : ఫ్యామిలీ హీరో సాహసాన్ని తిప్పి కొట్టారు – Nostalgia

Seenu : ఫ్యామిలీ హీరో సాహసాన్ని తిప్పి కొట్టారు – Nostalgia

రీమేకులు ఎంచుకునేటప్పుడు స్టార్ ఎవరైనా తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. ఇంకో భాషలో ఆడేసింది కదాని గుడ్డిగా ఇక్కడా తీయడానికి వెళ్తే తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటారా. ఈ ఉదాహరణ చూడండి. 1998 తమిళంలో ‘సొల్లామలే’ అనే సినిమా వచ్చింది. దర్శకుడు ఐవి శశి మొదటి సినిమా ఇదే. ఈయన ఎవరంటే ‘బిచ్చగాడు’తో విజయ్ ఆంటోనీకి ఇక్కడో బ్లాక్ బస్టర్ ఇచ్చింది తనే. డెబ్యూతోనే గొప్ప సక్సెస్ అందుకోవడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ. హీరోగా లివింగ్ స్టన్ కు చాలా పేరొచ్చింది. ఇతనేమి రజినికాంత్ లాగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ కాకపోవడంతో అంచనాలు లేవు.

ఆ కారణంగానే సొల్లామలేలో ఉన్న టిపికల్ పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయి అక్కడ ఘనవిజయం సాధించింది. దీన్ని నిర్మించిన ఆర్బి చౌదరి తెలుగులోనూ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందు వేరే హీరో అనుకున్నారు కానీ సినిమా చూసిన వెంకటేష్ కి ఇది బాగా నచ్చేసి తనే చేస్తానని ముందుకొచ్చారు. అప్పటికీ కాంబోలో రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఒకటి సూర్యవంశం. రెండు రాజా. ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఫిక్స్ చేసుకున్నారు. సోల్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో డైరెక్టర్ గా శశినే ఫిక్స్ చేసుకున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ భామ ట్వీన్ కిల్ ఖన్నా ను టాలీవుడ్ కు పరిచయం చేశారు.

సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకోగా బ్రహ్మానందం, సుధాకర్, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, చారుహాసన్ తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. రాజేంద్ర కుమార్ సంభాషణలు సమకూర్చారు. బ్యానర్ పెయింటింగులు వేసుకునే ఓ అమాయక కుర్రాడు అనుకోకుండా తనకిష్టమైన అమ్మాయికి మూగవాడిగా పరిచయమవుతాడు. అబద్దాలు ఆమెకు అసహ్యమని తెలిసి చివరికి తన నాలుకను త్యాగం చేయడమే శీను కథ. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఇలా నాలుకను కోసుకోవడం అనే అంశాన్ని మన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందులోనూ హీరో హీరోయిన్ మధ్య మాటలే లేకపోవడాన్ని మాస్ భరించలేకపోయారు. 1999 ఆగస్ట్ 27న విడుదలైన శీను అంచనాలు అందులేకపోయింది. కానీ పాటలు మాత్రం మ్యూజికల్ గా ఛార్ట్ బస్టర్ అయ్యాయి

Also Read : Akkineni Nageswara Rao : కృష్ణుడిగా వద్దన్నారు బ్రాహ్మణుడిగా మెప్పించారు – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి