iDreamPost

లిరిక్స్‌తో గిలిగింతలు పెడుతున్న ‘సైంధవ్‌’ పాట..

సైంధవ్‌ సినిమా ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

సైంధవ్‌ సినిమా ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

లిరిక్స్‌తో గిలిగింతలు పెడుతున్న ‘సైంధవ్‌’ పాట..

విక్టరీ వెంకటేష్‌ అప్‌ కమింగ్‌ సినిమా సైంధవ్‌పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌ సినిమాపై బజ్‌ను క్రియేట్‌ చేసింది. టాలీవుడ్‌ టు బాలీవుడ​ భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘‘ హిట్‌’’ సినిమాల దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సైంధవ్‌ విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది. వెంకటేష్‌ ఇంటర్వ్యూలు, ప్రెస్‌ కాన్ఫరెన్సుల్లో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సినిమాలోని ఓ పాట విడుదలైంది.  ‘‘ సరదా సరదాగా’’ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఈ పాటలో వెంకటేష్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్‌ కనిపించారు. పాట మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. ఇక, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి ‘‘ సరదా సరదాగా’’  పాటకు లిరిక్స్‌ అందించారు.

పాట లిరిక్స్‌.. 

‘‘ ఎగిరే స్వప్నాలే మనం..
మనదే కాదా… గగనం..
సిరివెన్నెల తడిసే గువ్వలం..
చిరునవ్వుల్లో చలనం ఇది చాల్లే.. ఇంతే చాల్లే..
ఇదిలా నిత్యం.. ఉంటే చాల్లే..
ఈ నూరేళ్లిలా .. మారే వెయ్యేళ్లుగా..
ఊపిరిలో సుమగంధాలే..

సరదా సరదా.. సరదాగా సాగింది సమయం..
మనసు.. మనసు దూరాలే మటుమాయం..
మనకూ మనకూ పరదాలే లేవందాం..
ఒకరికి ఒకరై ఒదిగిందీ అనుబంధం..

కలలా ఉందేంటీ.. ఈ నిజం..
నిజమే అందీ నయనం..
మనకే సొంతం అవునా ఈ వరం..
విరబూసిందీ హృదయం..
మందార పూల వందనాలు చేసే రాదారులే..
తల నిమురు తున్న పలకరింపులాయే చిరుగాలులే…
ఈ ఉల్లాసమే.. మనకు విలాసమై..
మనసంతా చిందాడిందే..

సరదా సరదా.. సరదాగా సాగింది సమయం..
మనసు.. మనసు దూరాలే మటుమాయం..
మనకూ మనకూ పరదాలే లేవందాం..
ఒకరికి ఒకరై ఒదిగిందీ అనుబంధం..

ఆనందమే అరచేతులా.. వాలిందిలా పసిపాపలా..
ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదెలా..
కరిగి ఆ వాన విల్లే ఇలా.. రంగుల్లో ముంచెత్తగా..
ఈ చిత్రం ఏకుంచలైనా చిత్రించేదెలా..

సరదా సరదా.. సరదాగా సాగింది సమయం..
మనసు.. మనసు దూరాలే మటుమాయం..
మనకూ మనకూ పరదాలే లేవందాం..
ఒకరికి ఒకరై ఒదిగిందీ అనుబంధం..

మరి, సైంధవ్‌ సినిమాలోని ‘‘ సరదా సరదాగా’’ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి