iDreamPost

వండటానికి ముందు చికెన్ ను కడగొద్దు! సైంటిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్..

  • Author Soma Sekhar Published - 06:50 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 06:50 PM, Tue - 26 September 23
వండటానికి ముందు చికెన్ ను కడగొద్దు! సైంటిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్..

సాధారణంగా చికెన్ షాపు నుంచి చికెన్ తేగానే ముందుగా శుభ్రంగా కడుగుతాం. 99 శాతం ఇల్లలో చేసే మెుదటి పని ఇదే. అయితే ఈ అలవాటును వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. చికెన్ ను వండుకునే ముందు అస్సలు కడగొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇస్తున్నారు. అదీకాక కడకుండానే అలానే వండేయాలని సూచిస్తున్నారు. అదేంటి అంతా రివర్స్ గా చెబుతున్నారు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.

ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు కొంత మందికి. ఇక మరికొంత మందికి వారాలతో పనిలేదు.. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినడమే. అయితే మాంసం ప్రియుల్లో ఎక్కువగా చికెన్ ప్రియులే ఉంటారు. అలాంటి చికెన్ ప్రియులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా చాలా మంది చికెన్ తీసుకురాగనే శుభ్రంగా కడిగి వండుతారు. కానీ అలా కడగడం చాలా డేంజరని సైంటిస్టులు పలు అధ్యాయనాల ద్వారా సూచిస్తున్నారు. ఇలా చికెన్ కడిగి వండితే లేనిపోని రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దాదాపు 25 శాతం మంది చికెన్ ను కడిగి వండతున్నట్లు తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఎదుర్కొవలసి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చికెన్ ను ఇలా కడగడం వల్ల అందులో క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా రెండు ప్రధాన బ్యాక్టీరియాలు నీటి ద్వారా ప్రతీ చోటకు వ్యాపిస్తుందని, దీని వల్ల అనారోగ్యం కలుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఇవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులు గత రెండు దశాబ్దాల్లో ఆస్ట్రేలియాలో రెట్టింపు అయినట్లు సైంటిస్టులు గుర్తించారు. సంవత్సరానికి వచ్చే రెండు లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసులు కోడి మాంసానికి సంబంధించి ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో వస్తున్నాయని తెలిపారు. చికెన్ ను కడగడం మూలంగా నీటి చుక్కల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని వారు తెలిపారు. అదీకాక ఫోర్స్ గా వచ్చే కుళాయి నీటితో అస్సలు కడగొద్దని హెచ్చరించారు. అయితే చికెన్ ను ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. మరి సైంటిస్టుల వార్నింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి