iDreamPost

బిగ్ బ్రేకింగ్: గొర్రెల పంపిణీ స్కామ్ బయటకి..నలుగురి అరెస్ట్!

Scam In Sheep Distribution: ఎంతో మంది ప్రభుత్వ అధికారులు నిజాయితీగా పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతి సొమ్ముకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేసే స్కామ్ తరచూ బయట పడుతుంటాయి. తాజాగా గొర్రెల పంపిణీలో స్కామ్ బయట పడింది.

Scam In Sheep Distribution: ఎంతో మంది ప్రభుత్వ అధికారులు నిజాయితీగా పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతి సొమ్ముకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేసే స్కామ్ తరచూ బయట పడుతుంటాయి. తాజాగా గొర్రెల పంపిణీలో స్కామ్ బయట పడింది.

బిగ్ బ్రేకింగ్: గొర్రెల పంపిణీ స్కామ్ బయటకి..నలుగురి అరెస్ట్!

ప్రజల సమస్యలను తెలుసుకునే వాటిని పరిష్కరించడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. అలానే ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పని చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం అవినీతి సొమ్ముకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల నుంచి లంచం తీసుకుంటూ కొందరు, వివిధ స్కామ్స్ చేస్తూ మరికొందరు ప్రభుత్వ అధికారులు అవినీతి సొమ్మును అర్జిస్తున్నారు. ఇటీవలే హెచ్ఎండీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ సంపాదనతో ఏసీబీ అధికారులకు దొరికిన సంగతి తెలిసిందే. తాజాగా పశు సంవర్ధక శాఖలోని గొర్రెల పంపిణీ కార్యక్రమంలో స్కామ్ బయటపడింది. గొర్రెల పంపిణీ లో రూ.2.10 కోట్లు నలుగురు ప్రభుత్వ అధికారులు నొక్కేశారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది.

తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్‌గా అందజేశారు. అయితే ఈ పథకంలో అవకతవకలు జరిగినట్లు ఇటీవలే కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ స్కాంలో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే గొర్రెల పంపిణీ విషయంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా పశుసంవర్ధక శాఖ లోని నలుగురు అధికారాలను ఏసీబీ అరెస్ట్ చేసింది.

పశుసంవర్థక శాఖ చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి , వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్, మేడ్చల్ పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయి లను ఏసీపీ అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచారు. ఇక ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో రూ.2.10 కోట్లు కొట్టేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నలుగురు అధికారులను అదుపులోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి