iDreamPost

స‌డ‌న్‌గా OTTలోకి స‌త్యం రాజేశ్ సస్పెన్స్,క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 07, 2024 | 12:44 PMUpdated Jun 07, 2024 | 12:44 PM

టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ పొలిమేర2 సినిమా తర్వాత ఇటీవలే హీరోగా టెనెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదలై రెండు నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాలేదు. కానీ, సడెన్ గా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకి ఎక్కడంటే..

టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ పొలిమేర2 సినిమా తర్వాత ఇటీవలే హీరోగా టెనెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదలై రెండు నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాలేదు. కానీ, సడెన్ గా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jun 07, 2024 | 12:44 PMUpdated Jun 07, 2024 | 12:44 PM
స‌డ‌న్‌గా OTTలోకి స‌త్యం రాజేశ్ సస్పెన్స్,క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నటుడు ‘సత్యం రాజేష్’.. టాలీవుడ్ లో ఒక కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కాగా, ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో పొలిమేర 2 సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు సత్యం రాజేష్. ఇక ఆ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో అందరికి తెలసిందే. అయితే ఆ సినిమా తర్వాత సత్య రాజేష్ మరో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘టెనెంట్’ మూవీతో ప్రేక్షకల ముందుకు వచ్చాడు. కాగా, ఈ మూవీని వై. యుగంధర దర్శకత్వం వహిచారు. అలాగే ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 19వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి మిక్స్‌డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. టెనెంట్ మూవీ రిలీజ్ అయ్యి 2 నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ కు రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సడెన్ గా టెనెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకి ఎక్కడంటే..

టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ ‘పొలిమేర2’ సినిమా తర్వాత ఇటీవలే హీరోగా టెనెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా,సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను వై. యుగంధర దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ఇకపోతే టెనెంట్ మూవీ రిలీజ్ అయ్యి 2 నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఓటీటీలోకి రాకపోవడంతో మూవీ లవర్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందానని చాలా ఆసక్తిగా ఎదుచు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సడెన్ టెనెంట్ మూవీ నేడు అనగా శుక్రవారం జూన్ 7వ తేదీన నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కోసం ఎదురుచూసిన వారు అలస్యం చేయకుండా వెంటనే ఈ సినిమా చూసేయవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో సత్యం రాజేష్ తో పాటు మేఘా చౌదరి, భ‌ర‌త్‌ కాంత్, చందన పయావుల, ఆడుకాలం నరేన్, ఎస్త‌ర్ కీలకపాత్రలో నటించారు.

ఇక టెనెంట్ సినిమా విషయానికి వస్తే..  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే హీరో రాజేశ్ త‌న మ‌ర‌ద‌లు సంధ్య‌ను వివాహం చేసుకుని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెడ‌తాడు. అయితే అ ప‌క్క‌నే మ‌రో ఫ్లాట్‌లో రిషి అనే యువ‌కుడు ఉంటుంటాడు. అతడు అప్ప‌టికే శ్రావ‌ణి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈక్ర‌మంలో అనుకోకుండా ఓ రోజు రిషి ద‌గ్గ‌రికి తాను ప్రేమిస్తున్నఅమ్మాయి వ‌స్తుంది. కానీ అదే స‌మ‌యంలో గౌత‌మ్‌ భార్య సంధ్య చ‌నిపోతుంది. ఇక అక్కడికి కొద్ది రోజుల‌కు రిషి, శ్రావణి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. అస‌లు సంధ్య ఎందుకు చ‌నిపోయింది, గౌత‌మ్ హ‌త్య చేశాడా ,రిషి, శ్రావ‌ణి ఎందుకు సుసైడ్ చేసుకున్నార‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది. మొత్తానికి ఇద్దరు భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. అలాగే ఒక అపార్ట్‌మెంట్‌లో ఎదురింట్లో పక్కింట్లో జరిగే స్టోరి. అంతేకాకుండా.. ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. పైగా ఈ తరం ఆడ‌వాళ్లు స‌మాజంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి, అపార్ట్‌మెంట్లలో ప‌క్క ప్లాట్ల‌లో ఎలాంటి వారు ఉంటారో  అనే మంచి సందేశాన్నిచ్చే సినిమానే ఈ టెనెంట్ కథ. మరి, ఈ విషయాలన్ని తెలుసుకోవాలంటే వెంటనే ఓటీటీలో ఈ టెనెంట్ సినిమా చూసేయాల్సిందే. మరి, సడన్ గా టెనెంట్ సినిమా  ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి