iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: వీడియో: సర్ఫరాజ్ రనౌట్.. జడేజాపై కోపంతో క్యాప్ విసిరికొట్టిన రోహిత్!

  • Published Feb 15, 2024 | 5:16 PM Updated Updated Feb 15, 2024 | 5:16 PM

తొలి మ్యాచ్‌తోనే సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. కానీ, దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. ఈ ఘటనతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

తొలి మ్యాచ్‌తోనే సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. కానీ, దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. ఈ ఘటనతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

  • Published Feb 15, 2024 | 5:16 PMUpdated Feb 15, 2024 | 5:16 PM
Sarfaraz Khan: వీడియో: సర్ఫరాజ్ రనౌట్.. జడేజాపై కోపంతో క్యాప్ విసిరికొట్టిన రోహిత్!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చాలా అన్‌లక్కీగా రనౌట్‌ అయ్యాడు. తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను.. సూపర్‌ బ్యాటింగ్‌తో హాఫ్‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకుని సూపర్‌ టచ్‌లో కనిపించాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత కూడా అదే వేగంతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. కానీ, మరో ఎండ్‌లో సెంచరీకి దగ్గరైన జడేజా 90 తర్వాత కాస్త ఒత్తిడికి గురవుతూ బ్యాటింగ్‌ చేశాడు. ఆ ఒత్తిడే పాపం.. సర్ఫరాజ్‌ పాలిట శాపమైంది. 99 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ 82వ ఓవర్‌ 5వ బంతిని మిడ్‌ ఆన్‌ దిశగా ఆడిన జడేజా సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. సర్ఫరాజ్‌ కూడా పరుగు కోసం వెళ్లాడు.

కానీ, బాల్‌ ఫీల్డర్‌ చేతుల్లో పడటంతో జడేజా పరుగుల ఆపేశాడు. కానీ, అప్పటికే క్రీజ్‌ మధ్యలోకి వచ్చేసిన సర్ఫరాజ్‌.. వెనక్కి తిరిగి వెళ్లేలోపే.. మార్క్‌ వుడ్‌ బాల్‌ అందుకుని వికెట్లను సూపర్‌ త్రోతో గిరాటేశాడు. దాంతో.. సర్ఫరాజ్‌ రనౌట్‌ అయ్యాడు. ఈ రనౌట్‌లో జడేజా తప్పిందం ఉండటంతో.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రోహిత్‌ శర్మ కోపంతో ఊగిపోతూ.. జడేజాను తిడుతూ.. తన క్యాప్‌ను విసిరికొట్టాడు. రోహిత్‌ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ తన తప్పులేకుండా.. దురదృష్టవశాత్తు అవుట్‌ అయ్యాడు. సర్ఫరాజ్‌ ఆడుతున్న తీరు చూస్తే.. అతను కచ్చితంగా సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించాడు. తొలి మ్యాచ్‌ ఆడుతూ.. సెంచరీ చేస్తే ఆ ఫీలింగే వేరు. కానీ, జడేజా చేసిన పొరపాటు కారణంగా సర్ఫరాజ్‌ ఆ అవకాశం కోల్పోయాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి తొలి రోజును ముగించింది. రవీంద్ర జడేజా 110, కుల్డీప్‌ యాదవ్‌ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మంచి స్టార్ట్‌ లభించలేదు. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 10 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. ఆ వెంటనే రజత్‌ పాటిదార్‌ 5 రన్స్‌ మాత్రమే చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. కానీ, రోహిత్‌ శర్మ-జడేజా నాలుగో వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రోహిత్‌ శర్మ 131 పరుగులు చేసి అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌తో పాటు సర్ఫరాజ్‌ ఆడిన తీరు, అతని రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.