iDreamPost

Sardar Paparayudu : ఎన్టీఆర్ సినిమాల్లో ఆణిముత్యం

ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వాళ్లకు డేట్స్ ఇవ్వరనే మాటలు వినిపించాయి. వీటిని క్రాంతి కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా సరే సాధించాలి. ఓ శుభముహూర్తాన అన్నగారిని వెళ్లి కలిశారు. తడబడుతూ అడిగినా ఊహించని విధంగా డేట్లు ఇచ్చేశారు. మంచి కథతో రండని ప్రోత్సహించారు. క్రాంతి కుమార్ కు ఎక్కడ లేని ఉత్సాహం ఉద్వేగం కలిగాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వాళ్లకు డేట్స్ ఇవ్వరనే మాటలు వినిపించాయి. వీటిని క్రాంతి కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా సరే సాధించాలి. ఓ శుభముహూర్తాన అన్నగారిని వెళ్లి కలిశారు. తడబడుతూ అడిగినా ఊహించని విధంగా డేట్లు ఇచ్చేశారు. మంచి కథతో రండని ప్రోత్సహించారు. క్రాంతి కుమార్ కు ఎక్కడ లేని ఉత్సాహం ఉద్వేగం కలిగాయి.

Sardar Paparayudu : ఎన్టీఆర్ సినిమాల్లో ఆణిముత్యం

1980 సంవత్సరం. కొన్ని సినిమాలతోనే నిర్మాత క్రాంతి కుమార్ కు మంచి పేరు వచ్చింది. కానీ ఆయన తీసినవన్నీ బడ్జెట్ లో రూపొందిన ఉత్తమాభిరుచి కలిగిన చిత్రాలే కావడంతో కమర్షియల్ గా ఆయన సాహసం చేయలేరేమో అనే కామెంట్స్ ఎక్కువ వినిపించేవి. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వాళ్లకు డేట్స్ ఇవ్వరనే మాటలు వినిపించాయి. వీటిని క్రాంతి కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా సరే సాధించాలి. ఓ శుభముహూర్తాన అన్నగారిని వెళ్లి కలిశారు. తడబడుతూ అడిగినా ఊహించని విధంగా డేట్లు ఇచ్చేశారు. మంచి కథతో రండని ప్రోత్సహించారు. క్రాంతి కుమార్ కు ఎక్కడ లేని ఉత్సాహం ఉద్వేగం కలిగాయి.

వెంటనే రంగంలోకి దిగారు. ముందు రాఘవేంద్రరావుని కలిశారు. ఆయన ఖాళీ లేరు. దాసరిది కూడా అదే పరిస్థితి కానీ ఎన్టీఆర్ సినిమా అనగానే వదులుకోవాలనిపించలేదు. వెంటనే తన దగ్గరున్న ఓ లైన్ ని చెప్పారు. నచ్చేసింది. రచయిత పాలగుమ్మి పద్మరాజుతో కలిసి ముగ్గురూ దాన్ని డెవలప్ చేశారు. ఇందులో హీరోది డ్యూయల్ రోల్. ఒక పాత్ర స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది అయితే రెండోది వర్తమానంలో పోలీస్ ఇన్స్ పెక్టర్ ది. అద్భుతమైన ట్రీట్మెంట్ తో ఫైనల్ వెర్షన్ రెడీ అయ్యింది. వయసు మళ్ళిన పాత్ర ఎన్టీఆర్ చేస్తారో లేదో అనే సంశయంతో దాసరి స్క్రిప్ట్ వినిపిస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆలస్యం చేయకుండా షూట్ మొదలుపెట్టారు. శ్రీదేవి హీరోయిన్ గా శారద, గుమ్మడి, పండరి బాయి, సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, పిజె శర్మ తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వెంకటరత్నం ఛాయాగ్రహణం అందించారు.

బ్రిటిషర్ గా మోహన్ బాబుకు ఎప్పటికి మరచిపోలేని గొప్ప క్యారెక్టర్ దక్కింది. ఎన్టీఆర్ దాసరి కాంబో కావడంతో బిజినెస్ పరంగా పిచ్చ క్రేజ్ వచ్చింది. షూటింగ్ టైంలో ఎన్టీఆర్ కు గాయమైతే కట్టు కట్టించుకుని మరీ అందులో పాల్గొన్నారు. ఎన్నో సామజిక సమస్యలను దాసరి ఇందులో ప్రధాన కథకు ముడిపెట్టిన తీరు నభూతో నభవిష్యత్. 1980 అక్టోబర్ 30న విడుదలైన సర్దార్ పాపారాయుడు వసూళ్ల సునామి సృష్టించింది. 22 కేంద్రాల్లో వంద రోజుల వేడుక జరుపుకుంది. షిఫ్టింగ్ మీద లెక్కే లేదు. తండ్రి కొడుకుల ద్విపాత్రభినయంలో కొత్త ట్రెండ్ సృష్టించిన సర్దార్ పాపారాయుడు తర్వాత ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. క్రాంతికుమార్ ను టాప్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టింది. దీని స్ఫూర్తితో ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ లైన్ ఈ చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. హలో టెంపర్, ఉయ్యాలకు వయసొచ్చింది, తెల్లచీర కళ్ళ కాటుక పాటలు ఏ కాలమైనా ఎవర్ గ్రీనే

Also Read : Movie CD’s : ఓటిటిలు లేని రోజుల్లో హోమ్ సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి