SNP
Sanju Samson, IPL 2024, RR vs LSG: టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న ప్లేయర్ సంజు శాంసన్. తాజాగా ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి ఓ సూపర్ రికార్డును సాధించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Sanju Samson, IPL 2024, RR vs LSG: టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న ప్లేయర్ సంజు శాంసన్. తాజాగా ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి ఓ సూపర్ రికార్డును సాధించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌కు బరిలోకి దిగాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రెండు జట్లు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ దుమ్మురేపాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ 9 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్.. జైస్వాల్‌తో కలిసి కొద్ది సేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. 49 పరుగుల వద్ద 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 పరుగులు చేసి.. యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 49 రన్స్‌కే రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన యాటిట్యూడ్ స్టార్, యువ క్రికెటర్ రియాన్ పరాగ్‌తో కలిసి సంజు శాంసన్ మరోసారి మంచి పార్ట్నర్‌షిప్‌ను నిర్మించాడు. అయితే.. ఇద్దరు ఆటగాళ్లు భారీ షాట్లతో లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా లక్నో ప్రధాన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని టార్గెట్ చేసి మరీ కొట్టారు. అయితే 29 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 43 పరుగులు చేసి పరాగ్.. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికే రాజస్థాన్ స్కోర్ 140 దాటింది. తర్వాత హెట్‌మేయర్ ఉండటం, సంజు అప్పటికే ఫిఫ్టీ పూర్తి చేసుకుని ఉండటంతో రాజస్థాన్ 200 చేసేలా కనిపించింది. కానీ, హెట్‌మేయర్ 5 రన్స్ చేసి అవుట్ అవ్వడం, చివర్లో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 82 రన్స్ చేసి అదరగొట్టాడు.
అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో శాంసన్ ఓ అరుడైన ఘనతను సాధించాడు. వరుసగా ఐదు ఐపీఎల్ సీజన్స్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేసిన ప్లేయర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో హాఫ్ సెంచరీ, ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ, ఆ తర్వాత 2022, 2023, ఇప్పుడు ఐపీఎల్ 2024లో కూడా ఆడిన తొలి మ్యాచ్‌లోనే శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఒక అరుదైన రికార్డు. దాదాపు హేమాహేమీ ఆటగాళ్లకు కూడా ఇలాంటి రికార్డు లేదు. అయితే.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియాలో చోటే లక్ష్యంగా సంజు శాంసన్ ఈ ఐపీఎల్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్‌తో పాటు, అతను సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– Fifty in 1st match of IPL 2020.
– Hundred in 1st match of IPL 2021.
– Fifty in 1st match of IPL 2022.
– Fifty in 1st match of IPL 2023.
– Fifty in 1st match of IPL 2024.Sanju Samson, The Captain 🫡 pic.twitter.com/pGnw16ESjX
— Johns. (@CricCrazyJohns) March 24, 2024
– Fifty in 1st match of IPL 2020.
– Hundred in 1st match of IPL 2021.
– Fifty in 1st match of IPL 2022.
– Fifty in 1st match of IPL 2023.
– Fifty in 1st match of IPL 2024.Sanju Samson, The Captain 🫡 pic.twitter.com/pGnw16ESjX
— Johns. (@CricCrazyJohns) March 24, 2024