iDreamPost

ఏపీ లో సరికొత్త విధానం.. నేడు శ్రీకారం

ఏపీ లో సరికొత్త విధానం.. నేడు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ లో వినియోగదారులకు ఇంటివద్దకే ఇసుక సరఫరా చేసే కార్యక్రమం కృష్ణా జిల్లాలో నేటి నుంచి అమల్లోకి రానుంది. రవాణా సదుపాయం బాధ్యతను కూడా ఏపీఎండీసీనే తీసుకుని కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇసుక కొనుగోలుదారులు భవన నిర్మాణ ప్రదేశం వివరాలు పోర్టల్‌లో ఉంచి, మ్యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేస్తారు. దీంతో నిర్మాణ ప్రదేశానికి నేరుగా ఇసుక వచ్చేస్తుంది. బుకింగ్‌ డబ్బు చెల్లించడంతో పాటు రవాణా చార్జీ కూడా చెల్లించాలి.

రవాణా చార్జీ కూడా ఏపీఎండీసీ నిర్ణయించింది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్నుకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా చార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6, 30 కిలోమీటర్లకు పైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున రవాణా చార్జీ నిర్ణయించారు. తొలుత కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తదుపరి ఈ నెల 20 నాటికి అన్ని జిల్లాల్లోను అమలు చేయనున్నారు.

రాష్ట్రంలో ఇసుక అవసరాల దృష్ట్యా రోజుకు 2.5 లక్షల టన్నుల ఇసుక అవసరమవుతుంది. ఆ మేరకు ఇసుకను స్టాక్‌ పాయింట్లలో సిద్ధం చేయనున్నారు. డిమాండ్‌కు నాలుగు రెట్లు అధికంగా ఇసుకను స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేయనున్నారు. తద్వారా వర్షాకాలంలో, నదులకు వరదలు కొనసాగిన కాలంలో ఇసుక కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానంతో ఒకే సారి రెండు సమస్యలు పరిష్కారం కానున్నాయి. మొదటి అంశం..ఇసుక అక్రమాలకు పూర్తిగా చెక్‌ పడనుంది. రెండో అంశం.. ముందుగానే మూడు నెలలకు సరిపడా ఇసుకను స్టాక్‌ చేసి ఉంచుతుండడంతో ఇసుక కొరతకు చెక్‌ పడనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి