iDreamPost
android-app
ios-app

నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

  • Author singhj Published - 06:59 PM, Wed - 16 August 23
  • Author singhj Published - 06:59 PM, Wed - 16 August 23
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

స్టార్ హీరోయిన్ సమంత మరో మూవీతో ఆడియెన్స్​ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత కలసి నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్వకత్వం వహించారు. ఈ ఫిల్మ్ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై మరింత బజ్ పెంచేందుకు మంగళవారం ‘ఖుషి’ మ్యూజికల్ నైట్​ను నిర్వహించింది మూవీ టీమ్. ఇందులో రౌడీస్టార్​ విజయ్​తో కలసి సామ్ చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. ఈ ఈవెంట్​లో స్టార్ సింగర్స్ చిన్మయి శ్రీపాద, సిద్ శ్రీరామ్ మధురమైన పాటలు ఆలపించారు.

‘ఖుషి’ మ్యూజికల్ నైట్​లో సమంత గురించి సింగర్ చిన్మయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తన డబ్బింగ్ సామ్ వల్లే మొదలైందని.. తను ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందన్నారు చిన్మయి. ఎవరేం మాట్లాడినా తనే బెస్ట్ అని అన్నారు. ‘అమృత’ మూవీలోని ‘ఏ దేవి వరము నీవో’ పాటను సామ్​కు డెడికేట్ చేశారు చిన్మయి. దీంతో ఎమోషనల్ అయిన సమంత.. ఆమెను హత్తుకుకున్నారు. ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసిన సామ్.. చిన్మయిని ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమెది ఎలాంటి కల్మషం లేని మనసు అని చెప్పారు.

చిన్మయిని తాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానన్నారు సమంత. ‘ఖుషి’ మ్యూజికల్ నైట్​లో పాల్గొని తన మీద ప్రేమను చూపించినందుకు ఆమెకు సామ్ ధన్యవాదాలు తెలిపారు. చిన్మయి మాటలతో ఆ ప్రోగ్రామ్ మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఆమె మనసు ఎంత అందంగా ఉంటుందో అంతటి మధురమైన గాత్రాన్ని భగవంతుడు తనకు ప్రసాదించాడని చిన్మయి గురించి ఇన్​స్టా పోస్ట్​లో రాసుకొచ్చారు. ఇక, మైత్రీ మూవీ పతాకంపై నిర్మితమైన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మరి.. ‘ఖుషి’ విడుదల కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş