iDreamPost
android-app
ios-app

వీడియో: తనను తాను కష్టపెట్టుకుంటున్న సమంత!

వీడియో: తనను తాను కష్టపెట్టుకుంటున్న సమంత!

సమంత ప్రస్తుతం తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. బాలీ పర్యటనలో ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉన్నారు. ఆమె తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో పెట్టారు. ఆ వీడియోలో.. తాను ఆరు నిమిషాల పాటు.. 4 డిగ్రీల చల్లటి నీళ్లలో ఉన్నానని పేర్కొ‍న్నారు. ఆమె ఎందుకలా చేస్తోందో ఫ్యాన్స్‌కు అంతుచిక్కటంలేదు. మైయోసైటిస్‌ చికిత్సలో భాగంగా అలా చేస్తోందా? లేక ప్రశాంతత కోసం అలా చేస్తోందా? అర్థం కాకుండా ఉంది.

ఇక, సమంత మైయోసైటిస్‌ చికిత్స కోసం మరికొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. దాదాపు ఆరు నెలల పాటు అక్కడే చికిత్స తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అమెరికాకు చికిత్స కోసం వెళుతున్న కారణంగా సమంత ఏ కొత్త సినిమాకు సైన్‌ చేయలేదు. ఉన్న షూటింగులను కూడా పూర్తి చేసుకున్నారు. ఖుషీ, చెన్నై స్టోరీస్‌ సినిమాలతో పాటు సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్‌లు పూర్తయ్యాయి. మరి కొన్ని రోజుల్లో ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సమంత సినిమాలకు ఆరు నెలల పాటు బ్రేక్‌ ఇవ్వటం కారణంగా ఆమె పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సమాచారం. ఏకంగా 12 కోట్ల రూపాయల మేర ఆమె నష్టపోనున్నారు. ఆరోగ్యం కంటే.. ఆదాయం ముఖ్యం కాదనుకున్న ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు. కోట్లను వదులుకుని అమెరికాకు పయనం అయ్యారు. సమంత అన్ని రకాలుగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి, సమంత 4 డిగ్రీల చలిలో 6 నిమిషాల పాటు ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet