iDreamPost

సలార్ vs డుంకి.. ఇది కదా అసలు బాక్సాఫీస్ వార్ అంటే..

  • Author ajaykrishna Published - 01:08 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Published - 01:08 PM, Tue - 26 September 23
సలార్ vs డుంకి.. ఇది కదా అసలు బాక్సాఫీస్ వార్ అంటే..

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా రేసు మొదలయ్యాక పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ కనిపించడం లేదు. ఒక హీరో సినిమా కోసం క్లాష్ వద్దనుకొని.. ఇంకో హీరో తమ సినిమాని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఒకరి కోసం ఒకరు పోటీ వద్దనుకొని.. సినిమాల బిజినెస్, కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేసుకుంటున్నారు. కానీ.. అసలు బాక్సాఫీస్ వద్ద మజా అనేది ఇక్కడే మిస్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఏ హీరో ఫ్యాన్స్ కైనా.. తమ హీరో సినిమాతో.. ఏయే పెద్ద హీరోల సినిమాలు పోటీకి వస్తాయా? అని చూస్తుంటారు. ఎందుకంటే.. ఎవరో ఒకరు పోటీకి వస్తేనే థియేటర్స్ లో.. ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంటుంది.

కొన్నాళ్ళుగా పాన్ ఇండియా స్టార్స్ కి సంబంధించి బిగ్ వార్ అయితే చూడలేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కానీ.. త్వరలో ఫ్యాన్స్ ఆకలి తీరబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇండియన్ సినిమా వద్ద హైయెస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసిన.. టాప్ 2 స్టార్స్ కి వార్ సెట్ అవ్వబోతుందని అంటున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లకు మధ్య బిగ్గెస్ట్ వార్ సమీపిస్తున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదేంటి.. ప్రభాస్ ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కి అభిమాని కదా.. ఇలా పోటీకి దిగుతాడా? అనంటే.. ఇప్పటికే సలార్ సినిమా రిలీజ్ వాయిదా పడి నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్.

ఆ సినిమాని నెక్స్ట్ ఇయర్ కి వాయిదా వేస్తే.. ప్రభాస్ నుండి రావాల్సిన మిగతా సినిమాలు కూడా డేట్స్ వాయిదా వేసుకొనే అవకాశం ఉంది. సో.. ఎలాగో మేకర్స్ సలార్ ని క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 22న రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఒకవేళ అదే డేట్ కన్ఫర్మ్ అయితే మాత్రం.. ఆ రోజు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్న షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానిల ‘డుంకి’తో బాక్సాఫీస్ పోటీ తప్పదు. సో.. నిజమైతే మాత్రం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ వార్.. ఇక్కడే కనిపించబోతుందని టాక్. ఇండియన్ హీరోలలో టాప్ గ్రాసర్స్ వీరే. సో.. ప్రభాస్, షారుఖ్ మధ్య పోటీ అంటే.. ఇదే కదా అసలు బాక్సాఫీస్ వార్ అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సలార్ మేకర్స్ ఏ డేట్ ఫిక్స్ చేస్తారో తెలియాల్సి ఉంది. మరి సలార్, డుంకి వార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి